ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రష్యాతో స్నేహం బలంగానే ఉంది: చైనా

ABN, First Publish Date - 2022-03-07T20:38:27+05:30

రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి నెలకొల్పడానికి చైనా మధ్యవర్తిత్వం వహిస్తే బాగుంటుందని యూరోపియన్ యూనియన్ విదేశాంగ పాలసీ చీఫ్ జోసెప్ బోరెల్ ఇదివరకే అభిప్రాయపడ్డారు. అనేక దేశాల ప్రతినిధులు సైతం ఈ విషయాన్ని పలుమార్లు ప్రస్తావించారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజింగ్: ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ రష్యాపై ఆంక్షలు విధిస్తుంటే.. చైనా మాత్రం రష్యాతో తమకు బలమైన స్నేహం కొనసాగుతోందని ప్రకటించింది. రష్యా-చైనా ఇది వరకు మంచి మిత్ర దేశాలే అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో చైనా వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. సోమవారం చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మాట్లాడుతూ మాస్కో-బీజింగ్ మధ్య మంచి స్నేహం ఉందని, అలాగే తాము ఉక్రెయిన్‌-రష్యా మధ్య మధ్యవతర్తిత్వం వహిస్తామని ప్రకటించారు. అవసరమైతే ప్రపంచ దేశాల మధ్య సత్సంభందాలను పెంపొందించడానికి సైతం తాము ప్రయత్నిస్తామని ఆయన పేర్కొన్నారు.


రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి నెలకొల్పడానికి చైనా మధ్యవర్తిత్వం వహిస్తే బాగుంటుందని యూరోపియన్ యూనియన్ విదేశాంగ పాలసీ చీఫ్ జోసెప్ బోరెల్ ఇదివరకే అభిప్రాయపడ్డారు. అనేక దేశాల ప్రతినిధులు సైతం ఈ విషయాన్ని పలుమార్లు ప్రస్తావించారు. చైనా మధ్యవర్తిత్వం వహిస్తే పరిస్థితులు చక్కదిద్దుకుంటాయనే విశ్వాసాన్ని అనేక మంది వ్యక్తం చేశారు. ఇప్పటి పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రపంచ దేశాలపై ఆర్థిక భారంతో పాటు మరిన్ని సమస్యలు తలెత్తుతాయని, వీలైనంత తొందరలో ఇరు దేశాల మధ్య శాంతిని నెలకొల్పాలని అంటున్నారు.


అయితే రష్యా-ఉక్రెయిన్ మధ్య మధ్యవర్తిత్వానికి చైనా ముందుకు వచ్చినప్పటికీ.. ఈ ప్రతిపాదనపై ఉక్రెయిన్ ఇప్పటి వరకు ఎలాంటి స్పందన ఇవ్వలేదు. రష్యా సైతం క్లారిటీ ఇవ్వకపోయినప్పటికీ చైనా చేసే ప్రతిపాదనలకు అంగీకరించవచ్చని అంటున్నారు. వాస్తవానికి తమ మధ్య మూడవ వ్యక్తి ప్రమేయం అవసరం లేదని హెచ్చరిస్తున్న పుతిన్.. చైనా మధ్యవర్తిత్వాన్ని ఎంత మేరకు స్వాగిస్తారో చూడాలి.

Updated Date - 2022-03-07T20:38:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising