Air India : ఎయిర్ ఇండియా విమానంలో పాము!
ABN, First Publish Date - 2022-12-11T01:12:43+05:30
ఎయిర్ ఇండియాకు చెందిన విమానంలో పాము కనిపించడం తాజాగా కలకలం రేపింది. కేరళలోని కాలికట్ నుంచి బయలుదేరిన బీ737-800
న్యూఢిల్లీ, డిసెంబరు 10: ఎయిర్ ఇండియాకు చెందిన విమానంలో పాము కనిపించడం తాజాగా కలకలం రేపింది. కేరళలోని కాలికట్ నుంచి బయలుదేరిన బీ737-800 విమానం దుబాయ్‌లో ల్యాండ్ అయిన తర్వాత కార్గో విభాగంలో పామును గుర్తించామని అధికారులు తెలిపారు. ప్రయాణికులందరినీ సురక్షితంగా విమానం నుంచి కిందకు దించేశామని పేర్కొన్నారు. కాగా.. ఈ ఘటనపై పౌరవిమానయాన శాఖ(డీజీసీఏ) విచారణకు ఆదేశించింది. ఎవరి నిర్లక్ష్యం వలన ఈ తప్పు జరిగిందో గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
Updated Date - 2022-12-11T01:12:44+05:30 IST