ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Biharలో పిడుగుపాటుకు 16మంది మృతి

ABN, First Publish Date - 2022-06-29T13:28:08+05:30

బీహార్‌ రాష్ట్రంలో పిడుగు పాటుకు 16 మంది మరణించారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాట్నా(బీహార్): బీహార్‌ రాష్ట్రంలో పిడుగు పాటుకు 16 మంది మరణించారు.తూర్పు చంపారన్ జిల్లాలో నలుగురు, భోజ్‌పూర్, సరన్‌ జిల్లాల్లో  ముగ్గురు, పశ్చిమ చంపారన్,అరారియా,బంకా, ముజఫర్‌పూర్‌లో ఒక్కొక్కరు చొప్పున పిడుగులు పడిమరణించినట్లు బీహార్ అధికారులు చెప్పారు.మృతుల కుటుంబాలకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.ప్రతికూల వాతావరణంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని బీహార్ విపత్తు నిర్వహణ శాఖ జారీ చేసిన ఆదేశాలను పాటించాలని ఆయన సీఎం ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.


‘‘ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు ఇంట్లో ఉండండి,సురక్షితంగా ఉండండి’’ అని సీఎం నితీష్ కుమార్ కోరారు.జూన్ 20వతేదీన బీహార్ రాష్ట్రంలో పిడుగుపాటుకు 17 మంది మరణించారు.గత ఏడాది కూడా బీహార్ రాష్ట్రంలో పిడగుపాటుకు వందలాదిమంది మృత్యువాత పడ్డారు.దేశంలోనే బీహార్ రాష్ట్రంలో పిడుగుపాటుకు మరణించిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. 


Updated Date - 2022-06-29T13:28:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising