ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సిరువాణి జలాలను సక్రమంగా పంపిణీ చేయండి

ABN, First Publish Date - 2022-02-02T13:59:39+05:30

సిరువాణి జలాశయం నుంచి కోయంబత్తూరు కార్పొరేషన్‌కు సమీప ప్రాంతాల్లోని ప్రజలకు సక్రమంగా జలాలను పంపిణీ చేయాలని కేరళ ముఖ్యమంత్రి పినరాయ్‌ విజయన్‌కు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ లేఖ రాశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                         - కేరళ సీఎంకు స్టాలిన్‌ లేఖ


చెన్నై: సిరువాణి జలాశయం నుంచి కోయంబత్తూరు కార్పొరేషన్‌కు సమీప ప్రాంతాల్లోని ప్రజలకు సక్రమంగా జలాలను పంపిణీ చేయాలని కేరళ ముఖ్యమంత్రి పినరాయ్‌ విజయన్‌కు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ లేఖ రాశారు. సిరువాణి జలాలలకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం ప్రతియేటా జూలై ఒకటి నుంచి యేడాదిపాటు 1.30 టీఎంసీల నీటిని కేరళ ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉందని, దానితో కోవై కార్పొరేషన్‌ పరిధిలో ఉన్నవారికి, సమీప ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు మంచినీటిని తమ ప్రభుత్వం సరఫరా చేస్తోందని స్టాలిన్‌ పేర్కొన్నారు. అయితే గత కొన్నేళ్లుగా కేరళ ప్రభుత్వం నిర్ణీత పరిమాణం కంటే తక్కువగానే నీటిని విడుదల చేస్తోందని ఆరోపించారు. గత ఆరేళ్లుగా కేరళ ప్రభుత్వం సిరువాణి జలాశయం నుంచి 0.484 టీఎంసీల జలాలలను మాత్రమే విడుదల చేశారని గుర్తు చేశారు. సిరువాణి జలాశయం పరివాహక ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిసినా ఆ జలాశయంలో నీటి నిల్వకు కేరళ ప్రభుత్వం తగు చర్యలు చేపట్టడం లేదన్నారు. విషయమై కేరళ ఇరిగేషన్‌ అధికారులతో తమ రాష్ట్రానికి చెందిన అధికారులు పలుమార్లు చర్చలు జరిపినా ఫలితం లేకపోయిందన్నారు. ఈ పరిస్థితులలో ఒప్పందం ప్రకారం 1.30 టీఎంసీల జలాలను కోయం బత్తూరు కార్పొరేషన్‌, పరిసర ప్రాంతాలకు సరఫరా అయ్యేలా తక్షణ చర్యలు చేపట్టాలని స్టాలిన్‌ ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2022-02-02T13:59:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising