ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Signalling: సిగ్నల్‌లో సమస్య... రైళ్ళు 2 గంటల ఆలస్యం

ABN, First Publish Date - 2022-11-15T10:23:03+05:30

విల్లుపురం సమీపంలో రైల్వే ట్రాక్‌పై సిగ్నలింగ్‌(Signalling) వ్యవస్థలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో చెన్నై సెంట్రల్‌ నుంచి దక్షిణాది జి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అడయార్‌(చెన్నై), నవంబరు 14: విల్లుపురం సమీపంలో రైల్వే ట్రాక్‌పై సిగ్నలింగ్‌(Signalling) వ్యవస్థలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో చెన్నై సెంట్రల్‌ నుంచి దక్షిణాది జిల్లాలకు వెళ్ళే అన్ని రైళ్ళు రెండు గంటలు ఆలస్యంగా బయలుదేరి వెళ్ళాయి. దక్షిణాది జిల్లాలకు వెళ్ళే రైళ్ళకు విల్లుపురం రైల్వే స్టేషన్‌ అతి ముఖ్యంగా వుంది. ఈ స్టేషన్‌కు సమీపంలోని కీళ్‌పెరుంబాక్కం వద్ద సోమవారం వేకువజామున 3.15 గంటల సమయంలో సిగ్నలింగ్‌లో సమస్య ఏర్పడింది. దీంతో చెన్నై వైపు రావాల్సిన పొదిగై, ముత్తునగర్‌, సేతు ఎక్స్‌ప్రెస్‏లను విల్లుపురం స్టేషన్‌లో నిలిపివేశారు. కన్నియాకుమారి, అనంతపురి ఎక్స్‌ప్రె్‌సను కండంబాక్కం స్టేషన్‌లో ఆపివేశారు. అదేవిధంగా చెన్నై నుంచి బయలుదేరాల్సిన రైళ్ళను కూడా సెంట్రల్‌లోనే నిలిపివేశారు. ఈ సిగ్నెల్‌ సరిచేసిన తర్వాత ఆ మార్గంలో రైళ్ళ రాకపోకలకు అనుమతించా రు. ఈ కారణంగా 45 నిమిషాల నుంచి 2 గంటల వరకు రైళ్ళు ఆలస్యంగా నడిచాయి.

Updated Date - 2022-11-15T10:23:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising