ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Siddaramaiahకు షాక్‌..!

ABN, First Publish Date - 2022-07-15T16:27:52+05:30

‘బర్త్‌డే బాయ్‌’ ప్రతిపక్షనేత సిద్దరామయ్యకు బిగ్‌షాక్‌ తప్పదనిపిస్తోంది. ఆయన ఆప్త సలహాదారుడు, మాజీ ఐపీఎస్‌ కెంపయ్య అరెస్టుకు సీఐడీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు, జూలై 14(ఆంధ్రజ్యోతి): ‘బర్త్‌డే బాయ్‌’ ప్రతిపక్షనేత సిద్దరామయ్యకు బిగ్‌షాక్‌ తప్పదనిపిస్తోంది. ఆయన ఆప్త సలహాదారుడు, మాజీ ఐపీఎస్‌ కెంపయ్య అరెస్టుకు సీఐడీ సిద్దమైనట్లు సమాచారం. 2013-18 దాకా ఐదేళ్ళపాటు సాగిన సబ్‌ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల నియామకాల అవినీతికి సంబంధించి మధుకర్‌శెట్టి రూపొందించిన నివేదికలో కెంపయ్య ప్రమేయం ఉన్నట్లు తేలింది. గతంలో నియామకాల విభాగం చీఫ్‌గా వ్యవహరించిన, నిజాయితీ, క్రమశిక్షణ కలిగిన అధికారిగా పేరొందిన మధుకర్‌శెట్టి ఈమేరకు నివేదిక సమర్పించారు. సిద్దరామయ్య పాలనా వ్యవధిలో మూడుసార్లు సబ్‌ఇన్‌స్పెక్టర్‌ల నియామకాలు జరిగాయి. డీఎ్‌సపీ శాంతకుమార్‌ ద్వారా కెంపయ్య అక్రమాలకు పాల్పడినట్లు నివేదికలో తేల్చారు. మదుకర్‌శెట్టి నివేదికను హోంశాఖ పక్కన పెట్టేసింది. ఆ తర్వాత డీజీపీ కూడా నిర్లక్ష్యం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయమై మంత్రి అశ్వత్థనారాయణ కూడా ప్రస్తావించారు. ఇలా సబ్‌ఇన్‌స్పెక్టర్‌ల నియామకాల అక్రమాలు ప్రతిపక్షనేత సిద్దరామయ్యకు చుట్టుకు నే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆగస్టు 3న సిద్దరామయ్య 75వ ఏడాదిలో అడుగుపెడుతున్న సందర్భంలో సిద్దరామోత్సవ పేరిట కాంగ్రెస్‌ వర్గాలు జోరుగా వేడుకలు జరిపేందుకు సిద్దమవుతున్నారు. ఇదే తరుణంలో కెంపయ్యను సీఐడీ అరెస్టు చేస్తే ఒక్కసారిగా ఉత్సాహం ఉసూరుమనిపించనుంది.

Updated Date - 2022-07-15T16:27:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising