ఆధారాలు దొరక్కుండా లంచం ‘మింగిన’ ఎస్సై
ABN, First Publish Date - 2022-12-15T03:09:16+05:30
లంచం తీసుకుంటూ విజిలెన్స్‌కి దొరికిపోయిన ఓ ఎస్సై ఆధారాలు దొరక్కుండా ఆ డబ్బునే మింగేందుకు ప్రయత్నించారు.
ఫరీదాబాద్, డిసెంబరు 14: లంచం తీసుకుంటూ విజిలెన్స్‌కి దొరికిపోయిన ఓ ఎస్సై ఆధారాలు దొరక్కుండా ఆ డబ్బునే మింగేందుకు ప్రయత్నించారు. ఈ ఘటన హరియాణాలోని ఫరీదాబాద్‌లో బుధవారం జరిగింది. తన గేదెను ఎవరో దొంగిలించారంటూ శుభ్‌నాథ్ అనే వ్యక్తి పోలీసు స్టేషన్‌కు వెళ్లాడు. దర్యాప్తు చేయాలంటే రూ.10 వేల లంచం ఇవ్వాలని అతడిని మహేంద్ర ఉలా అనే ఎస్సై డిమాండ్ చేశారు. బాధితుడు ఆయనకు రూ.6 వేలు ఇచ్చాడు. మిగిలిన రూ.4 వేల లంచం ఇవ్వడానికి ముందు విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో మహేంద్ర లంచం తీసుకుంటుండగా, విజిలెన్స్ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. షాక్ అయిన ఎస్సై, ఆధారాలు దొరక్కుండా ఆ డబ్బును మింగేశాడు.
Updated Date - 2022-12-15T03:09:17+05:30 IST