ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపాధి కల్పన దిశగా ‘శుభ్’ గ్రూప్...

ABN, First Publish Date - 2022-01-25T02:46:14+05:30

పేదరిక నిర్మూలన దిశగా యత్నిస్తోన్న ‘శుభ్’ గ్రూప్... ఈ క్రమంలో మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : పేదరిక నిర్మూలన దిశగా యత్నిస్తోన్న ‘శుభ్’ గ్రూప్... ఈ క్రమంలో మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులతో సమావేశమయ్యారు. మధ్య అమెరికాకు చెందిన శుభ్ గ్రూప్ ఛైర్మన్ నీల్ సావంత్, ఆసియా పసిఫిక్ విభాగం ఛైర్మన్ ఎస్‌వీఆర్(సరికొండ వినయ్‌కుమార్ రెడ్డి), తెలంగాణ ఇన్ఫర్మేఫన్ టెక్నాలజీ అసోసియేషన్(టీఐటీఏ)  ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అర్హులైన వారికి ఉద్యోగాల కల్పన, ప్రత్యేకించి ఐటీ సెక్టారును అందరికీ అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యాలుగా శుభ్ గ్రూప్ పనిచేస్తోంది. మరోవైపు వ్యవసాయంలో కూడా ఇంటెలిజెంట్ టెక్నాలజీ పరిధిని... రాష్ట్రంలోని గ్రామీణప్రాంతాల్లో కూడా అందుబాటులోకి తేవడం తదితర లక్ష్యాలతో శుభ్ గ్రూప్ పనిచేస్తోంది. పేదరిక నిర్మూలన, అందరికీ ఉపాధి తదితర లక్ష్యాలతో శుభ్ గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా కార్యక్రమాలను చేపడుతోంది. కాగా... భారత్‌లో శుభ్ గ్రూప్ తరపున... ఎస్‌వీఆర్ ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కార్యక్రమాలను నిర్వహించారు. 



Updated Date - 2022-01-25T02:46:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising