ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Noida Woman abuse: శ్రీకాంత్ త్యాగి అరెస్టు

ABN, First Publish Date - 2022-08-09T20:06:22+05:30

మహిళను దూషించిన కేసులో పరారీలో ఉన్న స్వయం ప్రకటిత బీజేపీ నేత శ్రీకాంత్ త్యాగిని పోలీసులు మంగళవారంనాడు మీరట్‌లో ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నొయిడా: మహిళను దూషించిన కేసులో పరారీలో ఉన్న స్వయం ప్రకటిత బీజేపీ నేత శ్రీకాంత్ త్యాగిని పోలీసులు మంగళవారంనాడు మీరట్‌లో అరెస్టు చేశారు. సిద్ధార్థపురి కాలనీలో తన సన్నిహిత మిత్రునితో కలిసి దాక్కున్న త్యాగిని పోలీసులు వలవేసి పట్టుకున్నారు. ఈ కేసులో తప్పించుకుని తిరుగుతున్న త్యాగి సోమవారం రాత్రి హరిద్వార్ మీుదాగా షహరాన్‌పూర్ చేరుకున్నారు. అక్కడి నుంచి రిషీకేష్ చేరుకుని మంగళవారం ఉదయం మీరట్ వచ్చాడు. నొయిడా పోలీసులు, యూపీ ఎస్‌టీఎఫ్ సంయుక్త ఆపరేషన్‌ నిర్వహించిన త్యాగి ఆచూకీ గుర్తించి అదుపులోనికి తీసుకున్నారు. తొలుత త్యాగి తలదాచుకున్న ప్రాంతాన్ని యూపీ ఎస్‌టీపీ పసిగట్టింది. ఆ సమాచారంతో నొయిడా పోలీసులు  అతన్ని అరెస్టు చేసారు. త్యాగితో పాటు అతను దాక్కోడానికి సహకరించిన ఇద్దరు మిత్రులను కూడా పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు.


శ్రీకాంత్ త్యాగికి చెందిన ఓ అక్రమ  నిర్మాణంపై స్థానికులు ఎప్పటి నుంచో ఆగ్రహంతో ఉన్నారు. ఈ క్రమంలోనే చెట్లను నాటడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన మహిళ పట్ల శ్రీకాంత్ త్యాగి దాడి చేశాడు. దీనిపై ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ వెంటనే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. గాలింపు చర్యల్లో భాగంగా శనివారం రాత్రి నొయిడా పోలీసులు త్యాగి సన్నిహితులు నలుగురుని నిర్బంధంలోకి తీసుకుని, త్యాగికి చెందినట్టు చెబుతున్న రెండు వాహననాలను సీజ్ చేశారు. దాడి చేసి పరారీలో ఉన్న త్యాగిపై యోగి సర్కార్ సైతం చర్యలకు దిగింది. నోయిడాలోని సెక్టార్ 93 బి గ్రాండ్ ఓమాక్స్ సోసైటీలోని శ్రీకాంత్ త్యాగి అక్రమ నిర్మాణాన్ని అధికారులు సోమవారంనాడు బుల్డోజర్‌తో తొలగించారు.

Updated Date - 2022-08-09T20:06:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising