ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Mathura శ్రీ కృష్ణ దేవాలయంలో లౌడ్ స్పీకర్ల స్విచ్ ఆఫ్

ABN, First Publish Date - 2022-04-21T13:04:27+05:30

మథుర నగరంలోని శ్రీ కృష్ణ దేవాలయంలో లౌడ్ స్పీకర్ల స్విచ్ ఆఫ్ చేశారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మథుర (ఉత్తరప్రదేశ్): మథుర నగరంలోని శ్రీ కృష్ణ దేవాలయంలో లౌడ్ స్పీకర్ల స్విచ్ ఆఫ్ చేశారు. మతపరమైన ప్రదేశాల్లో సౌండ్ సిస్టమ్‌ల వినియోగంపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఆదేశాల మేర మథురలోని శ్రీ కృష్ణ జన్మభూమి ఆలయ సముదాయంలోని వివిధ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన లౌడ్ స్పీకర్లను, సౌండ్ సిస్టమ్‌లను స్విచ్ ఆఫ్ చేశారు.శ్రీ కృష్ణ జన్మభూమి ఆలయ సముదాయంలోని ఎత్తైన మందిర భవనం భగవత్ భవన్‌పై ఏర్పాటు చేసిన లౌడ్‌స్పీకర్‌లను స్విచ్ ఆఫ్ చేసినట్లు శ్రీ కృష్ణ జన్మభూమి ట్రస్ట్, శ్రీ కృష్ణ జన్మస్థాన్ సేవా సంస్థాన్ సెక్రటరీ కపిల్ శర్మ తెలిపారు.భగవత్ భవన్ ఆలయంలోని సౌండ్ సిస్టమ్‌లు ఇకపై చాలా తక్కువ వాల్యూమ్‌లో ప్లే చేస్తామని శర్మ తెలిపారు. 


తద్వారా కీర్తన-భజన ధ్వని ఆలయ సముదాయం దాటి వెళ్లదు.గతంలో ఆలయంలో ఉదయం మంగళ హారతి నుంచి అన్ని మతపరమైన కార్యక్రమాలలో లౌడ్ స్పీకర్లను ఉపయోగించారని శర్మ చెప్పారు.ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రతి ఒక్కరికి తన మతపరమైన సిద్ధాంతాల ప్రకారం తన ఆరాధన పద్ధతిని అనుసరించే స్వేచ్ఛ ఉందని చెబుతూనే,  మతపరమైన ప్రదేశాల్లో ధ్వని వ్యవస్థల పరిమాణం మితంగా ఉండాలని సలహా ఇచ్చారు.



Updated Date - 2022-04-21T13:04:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising