గోవాలో కాంగ్రెస్‌కు షాక్
ABN, First Publish Date - 2022-09-15T10:08:20+05:30
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేస్తున్న సమయంలో గోవాలో ఆ పార్టీకి భారీ షాక్ తగిలింది.
మాజీ సీఎం కామత్ సహా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి
విలీనం చేస్తున్నట్టు సీఎల్పీలో తీర్మానం
హస్తానికి ఇక ముగ్గురు ఎమ్మెల్యేలే..
కాంగ్రెస్ ఛోడో యాత్ర ప్రారంభం
ముఖ్యమంత్రి సావంత్ వ్యాఖ్య
బీజేపీ బెదిరింపులు, ప్రలోభాలతో కుట్రలు: కాంగ్రెస్
పణజీ, సెప్టెంబరు 14: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేస్తున్న సమయంలో గోవాలో ఆ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్ సహా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రె్‌సను వీడారు. బుధవారం గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సదానంద్ శేట్ తన్వాడె సమక్షంలో వారందరూ కమలం పార్టీలో చేరారు. 40 మంది సభ్యులున్న గోవా అసెంబ్లీలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 20 సీట్లు గెలుచుకుని మళ్లీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ 11 సీట్లు సాధించింది. మెజార్టీకి ఒక సీటు తగ్గడంతో బీజేపీ మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేల చేరికతో ఆ పార్టీ బలం 28కి పెరిగింది. బీజేపీలో చేరిన ఎమ్మెల్యేలలో కామత్‌తో పాటు
మైఖేల్ లోబో, డెలిలా లోబో, రాజేశ్ ఫల్‌దేశాయ్, కేదార్ నాయక్, సంకల్ప్ అమోన్కర్, అలెక్సో సికెరా, రుడోల్ఫ్ ఫెర్నాండెజ్ ఉన్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరే ముందు బుధవారం ఉదయం సీఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బీజేపీలో విలీనం చేస్తున్నట్టుగా ఓ తీర్మానం ఆమోదించారు. ఈ సమావేశానికి మరో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు. 2019లో కూడా కాంగ్రె్‌సకు ఇలాగే గట్టి ఎదురు దెబ్బ తగిలింది. అప్పట్లో 10 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు.
సీనియర్లకు మంత్రి పదవులు!
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేస్తున్న సమయంలో గోవాలో ఆ పార్టీకి భారీ షాక్ తగిలింది.గ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిన సందర్భంగా గోవా సీఎం ప్రమోద్ సావంత్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఛోడో యాత్ర గోవా నుంచి ప్రారంభమైందన్నారు. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భేషరతుగా బీజేపీలో చేరారన్నారు. అయితే, కేబినెట్ నుంచి ముగ్గురు మంత్రులను తొలగించి, బీజేపీలో చేరిన కామత్, మైఖేల్ లోబో వంటి సీనియర్లకు అవకాశం కల్పిస్తారని రాజకీయ వర్గాలు వెల్లడించాయి. ప్రధాని నరేంద్ర మోదీ, గోవా ముఖ్యమంత్రి సావంత్ నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు బీజేపీలో చేరినట్టు మైఖేల్ లోబో వ్యాఖ్యానించారు. సీఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేసి బీజేపీలో విలీనం చేస్తున్నట్టు తీర్మానం చేశామని తెలిపారు. జూలైలోనే ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరతారనే వార్తలు రాగా కాంగ్రెస్ అధిష్ఠానం రంగంలోకి దిగి పరిస్థితులను చక్కదిద్దింది.
ఇది ఆపరేష్ కీచడ్: కాంగ్రెస్
గోవా పరిణామాలపై కాంగ్రెస్ సహా విపక్షాలు తీవ్రంగా స్పందించాయి. ఇది ఆపరేషన్ కీచడ్ (బురద) అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా విమర్శించారు. ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను లాక్కొనేందుకు బీజేపీ అన్ని రకాలుగా ప్రయత్నిస్తోందని విమర్శించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పడం, గూండాలతో బెదిరించడం, డబ్బులు వెదజల్లడం వంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. కాగా కాంగ్రెస్ పార్టీ దీనిని తీవ్రంగా పరిగణించాలని, పార్టీ ఫిరాయింపులను అడ్డుకునేందుకు చర్యలు తీసుకోవాలని కేరళ మంత్రి ఎంబీ రాజేశ్ సూచించారు. బీజేపీలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఎంత డబ్బు ఇచ్చారని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు అతిషీ మార్లెనా ప్రశ్నించారు. వారి ఇళ్లలో సీబీఐ, ఈడీలతో సోదాలు చేయించాలని డిమాండ్ చేశారు. కర్ణాటక, మధ్యప్రదేశ్, మేఘాలయా, అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్‌లోనూ బీజేపీ ఇలాగే ‘ఆపరేషన్ లోట్‌స’ను ప్రయోగించిందన్నారు.
Updated Date - 2022-09-15T10:08:20+05:30 IST