ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా శివాజీ గణేశన్‌ జయంతి వేడుకలు

ABN, First Publish Date - 2022-10-02T13:43:03+05:30

దివంగత నటదిగ్గజం ‘నడిగర్‌ తిలగం’ శివాజీగణేశన్‌ 95వ జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. శివాజీ కుటుంబసభ్యులతో కలిసి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                                    - ‘నడిగర్‌ తిలగం’కు నివాళి


ప్యారీస్‌(చెన్నై), అక్టోబరు 1: దివంగత నటదిగ్గజం ‘నడిగర్‌ తిలగం’ శివాజీగణేశన్‌ 95వ జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. శివాజీ కుటుంబసభ్యులతో కలిసి రాష్ట్రప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి స్టాలిన్‌ నివాళులర్పించారు. అడయార్‌లోని శివాజీ మణిమండపంలో ఆ మహానటుడు నటించిన చిత్రాల ఫొటోలతో కూడిన ప్రదర్శన ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin) ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు దురైమురుగన్‌, ఏవీ వేలు, ఎంపీ స్వామినాఽథన్‌, పీకే శేఖర్‌బాబు, ఎం.సుబ్రమణ్యం, రఘుపతి, ఎంపీ తమిళచ్చి తంగపాండ్యన్‌, డిప్యూటీ మేయర్‌ మహే్‌షకుమార్‌, తమిళనాడు కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి, ఎంపీ తిరునావక్కరసర్‌, శివాజీ కుటుంబసభ్యులు, నటులు రామ్‌కుమార్‌, ప్రభు, విక్రమ్‌ ప్రభు, బీజేపీ నేత కరాటే త్యాగరాజన్‌, సినీ గేయరచయిత వైరుముత్తు, దర్శకుడు ఆర్కే సెల్వమణి, పేరరసు తదితరులు నివాళులర్పించారు. టి.నగర్‌ హబీబుల్లా రోడ్డులో ఉన్న నడిగర్‌ సంఘం ప్రాంగణంలో శివాజీగణేశన్‌ చిత్రపటానికి సంఘం అధ్యక్షుడు నాజర్‌, కోశాధికారి కార్తీ, ఉపాధ్యక్షుడు పూచ్చి మురుగన్‌, సీనియర్‌ నటులు అజయ్‌రత్నం, రాజేష్‌ తదితరులు నివాళులర్పించారు.

Updated Date - 2022-10-02T13:43:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising