ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాజీ టెన్నిస్ స్టార్ షరపోవా.. ఎఫ్1 రేసర్ మైఖేల్ షూమాకర్‌పై ఎఫ్‌ఐర్! కోర్టు ఆదేశాలతో కేసు నమోదు!

ABN, First Publish Date - 2022-03-18T03:05:06+05:30

మాజీ టెన్నిస్ స్టార్ మరియా షరపోవా.. మాజీ ఫార్ములా వన్ రేసర్ మైఖేల్ షూమాకర్‌పై గురుగ్రామ్ పోలీసులు కేసు నమోదు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గురుగ్రామ్: రష్యా మాజీ టెన్నిస్ స్టార్ మరియా షరపోవా.. మాజీ ఫార్ములా వన్ ఛాంపియన్ మైఖేల్ షూమాకర్‌తో పాటూ మరో 11 మందిపై గురుగ్రామ్ పోలీసులు కేసు నమోదు చేశారు. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుకు సంబంధించి తనను వారు మోసం చేశారంటూ ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు రిజిస్టర్ చేశారు. షరపోవా, షూమాకర్‌లు ప్రమోటర్లుగా వ్యవహరించిన ఓ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులో అపార్ట్‌మెంట్ కొనుగోలుకు డబ్బులు చెల్లించి మోసపోయానంటూ న్యూఢిల్లీకి చెందిన షెఫాలీ అగర్వాల్ అనే మహిళ గురుగ్రామ్‌లోని కోర్టులో కేసు వేశారు. 2016లోనే పూర్తి కావాల్సిన ప్రాజెక్టు ఇప్పటికీ అసంపూర్ణంగానే ఉందని తెలిపారు.


రియల్ టెక్ డెవలప్‌మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చ్‌ర్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యంలో ఆ ప్రాజెక్టు ప్రారంభమైందన్నారు. రెసిడెన్షియల్ ఫ్లాట్ కొనుగోలుకు ఏకంగా రూ. 80 లక్షలు చెల్లించామని, ఆ ప్రాజెక్టును పూర్తి చేసే ఉద్దేశం కంపెనీకి లేకపోయినప్పటికీ వారు తమను నమ్మించి డబ్బులు తీసుకున్నారని పేర్కొన్నారు. అడ్వర్‌టైజ్‌మెంట్ల ద్వారా ఆ ప్రాజెక్టు గురించి తమకు తెలిసి కంపెనీ వారిని సంప్రదించామన్నారు. కంపెనీ ప్రకటనల్లో షరపోవా, షూమాకర్లను ప్రమోటర్లుగా పేర్కొన్నారని తెలిపిన బాధితురాలు.. షరపోవా పలుమార్లు ప్రాజెక్టును సందర్శించిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. కొనుగోలుదారులతో షరపోవా పలుమార్లు విందులకు హాజరైందని, బూటకపు వాగ్దానాలు చేసిందని చెప్పారు. ప్రాజెక్టుకు ప్రమోటర్లుగా వ్యవహరించిన ఈ సెలబ్రిటీలు ఇద్దరూ కంపెనీ నేరపూరిత కుట్రలో భాగస్వాములయ్యారని పేర్కొన్నారు. అయితే.. షెఫాలీ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించడంతో.. షరపోవా, షూమాకర్లపై బాద్‌షాపూర్ పోలీసులు మోసం, నేరపూరిత కుట్రలకు పాల్పడ్డారనే అభియోగాలు మోపుతూ కేసు రిజిస్టర్ చేశారు.

Updated Date - 2022-03-18T03:05:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising