ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉదయ్‌పూర్ టైలర్ హత్య ఇస్లాం వ్యతిరేకం: Syed Ahmed Bukhari

ABN, First Publish Date - 2022-06-29T21:09:41+05:30

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో హిందూ టైలర్ కన్హయ్య లాల్ (Kanhaiya Lal)ను తలనరికి చంపిన ఘటనను..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ (Udaipur)లో హిందూ టైలర్ కన్హయ్య లాల్ (Kanhaiya Lal)ను తలనరికి చంపిన ఘటనను జామా మసీద్ ఢిల్లీ సాహి ఇమామ్ సైయద్ అహ్మద్ బుఖారీ (Syed Ahmed Bukhari) తీవ్రంగా ఖండించారు. ఇది అత్యంత హృదయవిదారక, పాశవిక హత్య అని, అమానవీయమని ఆయన బుధవారంనాడు ఒక ప్రకటనలో అన్నారు. రియాజ్, ఘాస్ అనే ఇద్దరు వ్యక్తులు కన్హయ్యలాల్‌ను హత్య చేయడం అమానుషమని, అది కూడా మహమ్మద్ ప్రవక్త పేరుతో హత్య చేయడం పిరికిపందల చర్య అని, ఇస్లామ్‌ కూడా కూడా వ్యతిరేకమని అన్నారు. భారతదేశ ముస్లింల తరఫున తాను ఈ హత్యను ఖండిస్తున్నానని చెప్పారు.


ఇస్లాం మతం శాంతి, సామరస్యాలను కోరుకునే మతమని, మహ్మద్ ప్రవక్త జీవితమంతా దయ, కనికరం, ఓర్పు, ఔదార్యం, మానవత్వంతో నిండిఉండేదనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయని బుఖారి అన్నారు. ఇంతటి దారుణ హత్యకు పాల్పడిన వ్యక్తులు మహ్మద్ ప్రవక్త జీవితం, క్యారెక్టర్‌ గురించి కానీ, ఖురాన్, షరియా స్ఫూర్తి గురించి గానీ చదవి ఉంటే ఈ చర్యకు పాల్పడి ఉండేవారు కాదని బుఖారీ ఆ ప్రకటనలో అన్నారు.

Updated Date - 2022-06-29T21:09:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising