ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Sexual harassment: నగరంలో పారా హుషార్‌!

ABN, First Publish Date - 2022-08-11T13:47:32+05:30

పారా హుషార్‌! మీ పిల్లల్ని మీరు దగ్గరి నుంచి గమనిస్తున్నారా?.. వారు భద్రంగానే వున్నారా?.. వారి విషయంలో అంతా సాఫీగానే సాగుతోందా?.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ప్రతి పదిమంది విద్యార్థినుల్లో ఒకరిపై లైంగిక వేధింపులు

- మెడికోల సర్వేలో వెల్లడి


చెన్నై, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): పారా హుషార్‌! మీ పిల్లల్ని మీరు దగ్గరి నుంచి గమనిస్తున్నారా?.. వారు భద్రంగానే వున్నారా?.. వారి విషయంలో అంతా సాఫీగానే సాగుతోందా?.. ఈ విషయాలను మీరు ఖచ్చితంగా గమనించాల్సిందే! ఎందుకంటే చెన్నై మెడికల్‌ కళాశాల వైద్యబృందం చేపట్టిన సర్వేలో దిగ్ర్భాంతి గొలిపే నిజాలు బయల్పడ్డాయి. నగరంలో ప్రతి పదిమంది బాలికల్లో ఒకరు లైంగిక వేధింపులకు(Sexual harassment) గురవుతున్నట్లు వెల్లడైంది. సభ్య సమాజం సిగ్గుపడాల్సిన పలు విషయాలను ఆ సర్వే వెల్లడించింది. 9 నుంచి 11 తరగతులు చదువుతున్న 300 మంది బాలికలను ఆ వైద్య బృందం సర్వే నిర్వహించింది. ఈ బాలికలందరికీ బృందం సభ్యులు ప్రశ్న పత్రాలను అందజేశారు. అందులో అడిగిన ప్రశ్నలకు రాతపూర్వకంగా సమాధానాలు రాబట్టి సర్వేఫలితాలను ప్రకటించారు. ఆ మూడువందల మంది చిన్నారుల నుంచి సేకరించిన సమాధాన పత్రాలను పరిశీలించగా, వారిలో ప్రతిమందిలో ఒకరు లైంగిక వేధింపులకు గురవుతున్నట్లు తేలింది. స్కూలు బయట కూడా పలు రకాల వేధింపులకు గురవుతున్నట్లు ఆ సర్వేల్లో వెల్లడైంది. లైంగిక వేధింపుల సందర్భంగా చెంపదెబ్బలు తిన్నట్లు, కాలితో తన్నులు తిన్నట్లు ఆ బాలికలు పేర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో చిన్నారులకు వాతలు కూడా పడ్డాయి. వీరిలో ఏదో ఒకసారి లైంగిక వేధింపులకు గురైనవారు 43 శాతం మంది వరకు ఉన్నారు. నిత్యం లైంగిక వేధింపులకు గురయ్యేవారు 28 శాతం మంది వరకు ఉన్నారు.  ఈ వేధింపులన్నీ తండ్రి, స్నేహితులు, బంధువులు, ఇరుగుపొరుగువారి వల్లే జరుగుతున్నట్లు సర్వేలో తేలడం వైద్యనిపుణులను సైతం దిగ్ర్భాంతి గొలుపుతోంది. సర్వేలో పాల్గొన్న చిన్నారులంతా అసభ్యపరమైన స్వర్శల గురించి, సభ్యమైన స్పర్శలు గురించి మంచి అవగాహన  ఉండటం ఊరట చెందాల్సిన అంశమని సర్వే నిర్వాహకులు తెలిపారు. ఇలా లైంగిక వేధింపులకు గురయ్యే బాలికలు తమ గోడును తల్లి దగ్గరో, స్నేహితుల వద్ద వెళ్ళబోసుకుంటున్నారని ఆ సర్వేలో వెల్లడైంది. పసివాడని ఈ చిన్నారులు లైంగిక వేధింపులకు గురికాకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, ప్రత్యేకించి పోలీసు శాఖ(Police Department)దేనని సర్వే నిర్వాహకులు పేర్కొన్నారు.

Updated Date - 2022-08-11T13:47:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising