ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Supreme Courtలో కరోనా కలకలం..10మంది జడ్జీలకు పాజిటివ్

ABN, First Publish Date - 2022-01-19T16:14:10+05:30

ఢిల్లీలోని సుప్రీంకోర్టులో కరోనా కలకలం రేపింది. సుప్రీంకోర్టులో 10 మంది జడ్జీలకు కొవిడ్ పాజిటివ్ అని పరీక్షల్లో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఢిల్లీలోని సుప్రీంకోర్టులో కరోనా కలకలం రేపింది. సుప్రీంకోర్టులో 10 మంది జడ్జీలకు కొవిడ్ పాజిటివ్ అని పరీక్షల్లో తేలడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. సుప్రీంకోర్టులో ఆరోగ్యశాఖ ఉద్యోగులు ప్రతీరోజు కరోనా పరీక్షలు చేస్తున్నారు.సుప్రీంకోర్టులో కొవిడ్ పాజిటివిటీ రేటు 30 శాతానికి పెరిగిందని సుప్రీంకోర్టు ఉద్యోగులు చెప్పారు. సుప్రీంకోర్టులో మొత్తం 32 మంది జడ్జీలుండగా వారిలో 10 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ పీఎస్ నరసింహలు కరోనా నుంచి కోలుకొని తిరిగి విధులకు హాజరవుతున్నారు. 8 మంది జడ్జీలు కొవిడ్ తో క్వారంటైన్ లో ఉన్నారు. దీంతో సుప్రీంకోర్టులో అత్యవసర కేసుల విచారణకు బెంచ్ ల ఏర్పాటు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు ఛాలెంజ్ గా మారింది. 


సుప్రీంకోర్టులో కొవిడ్ కలకలంతో 24 గంటలపాటు వైద్యసేవలు అందిస్తున్నారు. సుప్రీంకోర్టులో ప్రతీరోజు 200 మంది వరకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తున్నారు. సుప్రీంకోర్టులో 1500మంది ఉద్యోగులుంటే వారిలో 400 మందికి కరోనా పాజిటివ్ అని వచ్చింది.సుప్రీంకోర్టు ప్రాథమిక వైద్యకేంద్రంలో పనిచేస్తున్న ముగ్గురు వైద్యులకు కూడా కరోనా సోకింది. వారం రోజుల్లో కరోనా సోకిన జడ్జీల సంఖ్య రెట్టింపు అయింది. సుప్రీంకోర్టులో కరోనా కేసుల వ్యాప్తితో కోర్టులు వర్చువల్ హియరింగ్ లు సాగుతున్నాయి.


Updated Date - 2022-01-19T16:14:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising