ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kedarnath: కేదార్‌నాథ్‌లో దుర్ఘటన.. కుప్పకూలిన హెలికాఫ్టర్.. ఏడుగురు మృతి..

ABN, First Publish Date - 2022-10-18T18:52:52+05:30

కేదార్‌నాథ్ దగ్గర హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. వాతావరణం అనుకూలించక హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలెట్లు, ఐదుగురు యాత్రికులు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉత్తరాఖండ్: కేదార్‌నాథ్ దగ్గర హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. వాతావరణం అనుకూలించక హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలెట్లు, ఐదుగురు యాత్రికులు మృతి చెందారు. కేదార్‌నాథ్ ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫాటా దగ్గర ఈ ఘటన జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. గుప్త్‌కాశి నుంచి కేదార్‌నాథ్‌కు యాత్రికులను తీసుకెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. సీఎంకు స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న అభినవ్ కుమార్ ఈ ఘటన గురించి వివరాలను వెల్లడించారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఈ దుర్ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యాత్రికులతో వెళుతున్న హెలికాఫ్టర్ గరుడ ఛట్టి దగ్గర కూలినట్లు తెలిసిందని.. ఎస్డీఆర్‌ఎఫ్ సహాయక బృందంతో పాటు జిల్లా అధికార యంత్రాగాన్ని కూడా స్పాట్‌కు పంపి అప్రమత్తం చేసినట్లు ఆయన తెలిపారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరుపుతామని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి వెల్లడించారు.



Updated Date - 2022-10-18T18:52:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising