ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అండమాన్ నికోబార్ దీవులను వణికించిన వరుస earthquakes

ABN, First Publish Date - 2022-07-05T13:58:55+05:30

అండమాన్ నికోబార్ దీవుల్లో సోమ, మంగళవారాల్లో రెండు రోజులపాటు అండమాన్ సముద్రంలో వరుస భూకంపాలు సంభవించాయి....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పోర్ట్ బ్లెయిర్: అండమాన్ నికోబార్ దీవుల్లో సోమ, మంగళవారాల్లో రెండు రోజులపాటు అండమాన్ సముద్రంలో వరుస భూకంపాలు సంభవించాయి. మంగళవారం నాడు అండమాన్ నికోబార్ దీవుల్లో సంభవించిన భూకంపం ప్రభావం రిక్టర్ స్కేల్‌పై 5.0గా నమోదైంది.జులై 4-5 తేదీల్లో అండమాన్ సముద్రంలో సంభవించిన వరుస భూకంపాలు అండమాన్, నికోబార్ దీవులను వణికించాయి. మంగళవారం ఉదయం 5:57 గంటలకు రిక్టర్ స్కేలుపై 5.0గా నమోదైన బలమైన ప్రకంపనలు నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.ప్రాణనష్టం, ఆస్తినష్టం గురించి ఇంకా తెలియలేదు.5.0 భూకంపం యొక్క కేంద్రం రాజధాని పోర్ట్ బ్లెయిర్‌కు 215 కిలోమీటర్ల దూరంలో ఉంది. 


సోమవారం సాయంత్రం 5.18 గంటలకు అండమాన్ దీవుల చుట్టుపక్కల ప్రాంతంలో మొదటి భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. సోమవారం నాటి భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.6గా నమోదైంది.అండమాన్ దీవుల్లో నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ రెండు రోజుల్లో 24 భూ ప్రకంపనలను నమోదు చేసింది.


Updated Date - 2022-07-05T13:58:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising