ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Pakistan : సైన్యాన్ని విమర్శించిన పాత్రికేయునిపై దుండగుల దాడి

ABN, First Publish Date - 2022-07-02T17:09:49+05:30

పాకిస్థాన్ సైనిక జనరల్స్‌ను విమర్శించిన సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లాహోర్ : పాకిస్థాన్ సైనిక జనరల్స్‌ను విమర్శించిన సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకుడు ఆయాజ్ అమిర్ (73)పై శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఆయన ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొని తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో ముసుగు ధరించిన కొందరు వ్యక్తులు ఆయనను కారు నుంచి బయటికి లాగి, కొట్టారు. 


పాకిస్థాన్ ఆర్మీ జనరల్స్ ‘‘ప్రాపర్టీ డీలర్స్’’ అని ఆయాజ్ అమిర్ గురువారం విమర్శించారు. ఆ మర్నాడే ఆయనపై ఈ దాడి జరిగింది. ‘దునియా న్యూస్’ టీవీ చానల్లో ఓ కార్యక్రమంలో పాల్గొని ఇంటికి తిరిగి వెళ్తుండగా తనపై దాడి జరిగిందని ఆయన చెప్పారు. గుర్తు తెలియని వ్యక్తులు తన కారును అడ్డగించి, తనను కారులో నుంచి బయటకు లాగి, తనపై దాడి చేశారని తెలిపారు. తన బట్టలను చింపేశారని చెప్పారు. తన సెల్‌ఫోన్, వాలెట్‌లను కూడా లాక్కున్నారని చెప్పారు. రద్దీగా ఉండే ఆ మార్గంలో జనం రావడం ప్రారంభమవడంతో తనను వదిలిపెట్టారన్నారు. 


అసలు ఆయాజ్ ఏమన్నారు?

ఆయాజ్ గురువారం ఇస్లామాబాద్‌లో జరిగిన ఓ సమావేశంలో ప్రభుత్వ మార్పుపై మాట్లాడారు. పాకిస్థాన్ రాజకీయాల్లో సైన్యం పాత్రను ప్రస్తావించారు. సైనిక జనరల్స్ ప్రాపర్టీ డీలర్స్ వంటివారని ఆరోపించారు. మహమ్మద్ అలీ జిన్నా, అల్లమ ఇక్బాల్ ఫొటోలను తొలగించి, వాటి స్థానంలో ఈ ప్రాపర్టీ డీలర్స్ ఫొటోలను పెట్టాలన్నారు. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వాను పరోక్షంగా ప్రస్తావిస్తూ, ఆయన పదవీ కాలం ఆరో సంవత్సరంలో కొనసాగుతోందని, మరోసారి పొడిగింపు కోసం ఆయన చూస్తున్నారని అన్నారు. ఈ సెమినార్లో పాల్గొన్న మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‌పై కూడా ఆయాజ్ విమర్శలు గుప్పించారు. ఇమ్రాన్ పదవీ కాలంలో సైన్యం అడుగు జాడల్లో నడిచారని దుయ్యబట్టారు. ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. 


ఇదిలావుండగా, ఆయాజ్‌పై జరిగిన దాడిపై నివేదిక సమర్పించాలని పంజాబ్ ముఖ్యమంత్రి హమ్‌జా షహబాజ్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ జనరల్‌ను ఆదేశించారు. 


ఆయాజ్‌పై దాడిని ఇమ్రాన్ ఖాన్ తీవ్రంగా ఖండించారు. పాకిస్థాన్ అత్యంత దారుణమైన నియంతృత్వంలోకి కూరుకుపోతోందని, పాత్రికేయులు, ప్రతిపక్ష నేతలు, ప్రజలపై బూటకపు కేసులు నమోదవుతున్నాయని, హింస పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 


Updated Date - 2022-07-02T17:09:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising