ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీఎంసీలో చేరిన కాంగ్రెస్ సీనియర్ నేత

ABN, First Publish Date - 2022-04-18T01:24:41+05:30

1976 నుంచి బొరా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. తన రాజీనామాను కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీకి పంపినట్లు ఆయన తెలిపారు. పార్టీని వీడడానికి గల కారణాలను ఆయన తెలిపారు. కాంగ్రెస్‌లోని కొందరు నేతలు బీజేపీతో ముఖ్యమంత్రితో టచ్‌లో ఉన్నారని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గువహాటి: అస్సాం కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రుపిన్ బొరా ఆదివారం తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొద్ది రోజుల క్రితం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసిన బోరా.. ఓటమి పాలయ్యారు. ఈ ఓటమి అనంతరమే ఆయన కాంగ్రెస్‌ను వీడతారని ప్రచారం జరిగింది. అనుకున్నట్లుగానే ఆదివారం మద్యాహ్నం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, సాయంత్రం కోల్‌కతాలోని టీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఆధ్వర్యంలో తృణమూల్ తీర్థం పుచ్చుకున్నారు.


బొరాను టీఎంసీలోకి ఆహ్వానించిన అనంతరం.. ఈ విషయమై అభిషేక్ బెనర్జీ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ‘‘రుపిన్ బొరాను పార్టీలోకి సాధర స్వాగతం. బలమైన, అనుభవం కలిగిన నాయకుడు టీఎంసీలోకి రావడం హర్షణీయం. మన ప్రజల కోసం మీరు పని చేస్తారని ఎదురు చూస్తున్నాం’’ అని రాసుకొచ్చారు.


1976 నుంచి బొరా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. తన రాజీనామాను కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీకి పంపినట్లు ఆయన తెలిపారు. పార్టీని వీడడానికి గల కారణాలను ఆయన తెలిపారు. కాంగ్రెస్‌లోని కొందరు నేతలు బీజేపీతో ముఖ్యమంత్రితో టచ్‌లో ఉన్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం పట్టించుకోవడం లేదని, అందుకే తాను పార్టీని వీడుతున్నట్లు బొరా తెలిపారు.

Updated Date - 2022-04-18T01:24:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising