ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీరాముడి పేరిట మతచిచ్చు రాముడికే అవమానం : సంజయ్ రౌత్

ABN, First Publish Date - 2022-04-18T00:46:37+05:30

న్యూఢిల్లీ : శ్రీరాముడి పేరిట మత చిచ్చు పెట్టడమంటే భగవంతుడు శ్రీరాముడు అనే మూల భావనకే అవమానకరమని శివసేన నేత సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : శ్రీరాముడి పేరిట మత చిచ్చు పెట్టడమంటే భగవంతుడు శ్రీరాముడు అనే మూల భావనకే అవమానకరమని శివసేన నేత సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. శ్రీరామనవమి రోజు మతఘర్షణలకే వేదికైన మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలు ఆ శ్రీరాముడిని కూడా అసహనానికి గురిచేస్తాయని సామ్నాకు రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. దేశం రెండుగా చీలిపోతున్నా జనాల్లో మత విద్వేషాన్ని నింపి ఎన్నికల్లో గెలుపొందాలనే వ్యూహాన్ని బీజేపీ ఎంచుకుందని తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల్లో గెలుపొందేందుకు మతఛాందస్సవాద చిచ్చుపెట్టడం, శాంతికి భంగం కలిగించడమంటే రెండోసారి దేశ విభజనకు బీజం వేస్తున్నట్టేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో మత ఘర్షణలు జరుగుతుండడంపై స్పందిస్తూ.. ఇది మంచి సంకేతం కాదన్నారు. కాగా ఖర్గోవ్‌లో తలెత్తిన మత ఘర్షణల కారణంగా అక్కడ కర్ఫ్యూ విధించాల్సి వచ్చింది. శివసేన అధికార మీడియా సామ్నాలో వారాంతపు వ్యాసంలో ఈ వ్యాఖ్యలు చేశారు. శివసేన లీడర్ సంజయ్ రౌత్ సామ్నా పేపర్‌కు ఎగ్జిక్యూటివ్ ఎడిటర్‌గా పనిచేస్తున్న విషయం తెలిసిందే. 

Updated Date - 2022-04-18T00:46:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising