ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Maharastra political Crisis : చివరి నిమిషంలో ప్లాన్ మార్చిన Shivasena రెబల్ ఎమ్మెల్యేలు..

ABN, First Publish Date - 2022-06-29T20:54:48+05:30

ఎడతెగని ‘మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం’( Maharastra Political Crisis) కొనసాగుతుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : ఎడతెగని ‘మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం’( Maharastra Political Crisis) కొనసాగుతుంది. అసెంబ్లీలో బలనిరూపణ(Floor test) చేసుకోవాలంటూ సీఎం ఉద్ధవ్ థాక్రే(CM Uddav thackerey)కి గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారీ(Bhagath singh koshyari) ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో.. గువాహటిలో ఉన్న రెబల్ ఎమ్మెల్యే(Rebal MLAs)లు ప్లాన్ మార్చారు.  బుధవారం ఉదయం ఏక్‌నాథ్ షిండే(Eknath Shinde) సారధ్యంలో ఎమ్మెల్యేలంతా  కామాఖ్యా(Kamakhya temple) ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం గోవా(Goa) బయలుదేరతారని అంతా భావించారు. ఇందుకు అనుగుణంగా గోవాలోని ‘ తాజ్ రిసార్ట్ అండ్ కన్వెన్షన్ సెంటర్’లో 70 రూమ్‌లను ఇదివరకే బుక్ చేసుకున్నారు. గోవా బీజేపీ పాలిత రాష్ట్రం కావడం, ముంబైకి సమీపాన ఉండడంతో రేపటి(గురువారం) బలపరీక్షకు సులభంగా హాజరవ్వొచ్చని ప్లాన్స్ వేసుకున్నారు. స్పైస్‌జెట్‌కి చెందిన ప్రత్యేక చార్టెడ్ ఫ్లైట్‌ కూడా సిద్ధం చేసుకున్నారు. 


అయితే చివరి నిమిషంలో రెబల్ క్యాంప్ ప్లాన్స్ మార్చింది. బలనిరూపణకు సంబంధించి గవర్నర్ ఆదేశాలను సవాలు చేస్తూ శివసేన సుప్రీంకోర్ట్‌లో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో.. సాయంత్రం వరకు వేచిచూడాలని నిర్ణయించింది. సుప్రీం ఆదేశాలు బట్టి నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ప్లాన్ వేసుకున్నారని సమాచారం. ఇందుకు అనుగుణంగానే గోవా ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. అయితే ఎప్పుడంటే అప్పులు బయలుదేరేందుకు చార్టెడ్ విమానాన్ని సిద్ధంగా ఉంచుకున్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. బుధవారం ఉదయం శ్రీ కామాఖ్యా ఆలయం దర్శనం అనంతరం రెబల్ ఎమ్మెల్యేల సారధి ఏక్‌నాథ్ షిండే మీడియాతో మాట్లాడారు. ‘‘ రేపు(గురువారం ముంబై చేరుకుంటాం. మాతో 50 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మూడింట రెండో వంతు మెజారిటీ ఉంది. ఎలాంటి విశ్వాసం పరీక్ష ఉన్నా మాకు భయం లేదు. అన్ని పరీక్షలు నెగ్గుతాం. మమ్మల్ని ఎవరూ ఆపలేరు. ప్రజాస్వామ్యంలో మెజారిటీయే ముఖ్యం. ఆ మెజారిటీ మాకు ఉంది’’ అని అన్నారు. కాగా గోవాలోని ‘ తాజ్ రిసార్ట్ అండ్ కన్వెన్షన్ సెంటర్’లో ఇప్పటికే 70 రూంలు బుక్ చేసినట్టు రిపోర్టులు కూడా వెలువడ్డాయి.



కాగా గువాహటిలో వారం రోజులుగా రెబల్ ఎమ్మెల్యేలు మకాం ఉంటున్న రాడిసన్ బ్లూ హోటల్‌లోకి బుధవారం ఉదయం ప్రైవేటు బస్సులు వెళ్లాయి. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఎమ్మెల్యేలంతా బస్సుల్లో శ్రీ కామాఖ్య అమ్మవారి దర్శనానికి వెళ్లారు. వీరివెంట అసోం పార్లమెంటరీ అఫైర్స్ మంత్రి పియూష్ హజారికా, ఇతర బీజేపీ రాష్ట్ర స్థాయి నేతలు ఉన్నారు.

Updated Date - 2022-06-29T20:54:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising