ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళ.. మసాజ్ చేయించుకున్న పోలీసు అధికారి.. వీడియో వైరల్

ABN, First Publish Date - 2022-04-29T23:37:07+05:30

ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన ఓ మహిళతో మసాజ్ చేయించుకున్నాడో పోలీసు అధికారి. స్టేషన్‌లోనే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాట్నా: ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన ఓ మహిళతో మసాజ్ చేయించుకున్నాడో పోలీసు అధికారి. స్టేషన్‌లోనే అర్థ నగ్నంగా కూర్చుని మసాజ్ చేయించుకున్న ఆయన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయి చివరికి ఉన్నతాధికారుల దృష్టిలో పడింది. దీనిని తీవ్రంగా పరిగణించిన పై అధికారులు ఆయనను సస్పెండ్ చేశారు. బీహార్‌లోని సహస్ర జిల్లాలో జరిగిందీ ఘటన. ఆ వీడియోలో కనిపిస్తున్న పోలీసు అధికారి పేరు శశిభూషణ్ సిన్హా. నౌహట్ట పోలీస్ స్టేషన్‌ పరిధిలోని దర్హార్ ఔట్‌పోస్టులో పనిచేస్తున్నారు. షర్ట్ లేకుండా మసాజ్ చేయించుకుంటున్న ఆయన ఫోన్‌లో మాట్లాడుతూ మహిళకు సంబంధించిన కేసు విషయమై మాట్లాడినట్టు తెలుస్తోంది. 


జైలులో ఉన్న తన కుమారుడిని విడిపించుకునే ఉద్దేశంతో ఆ మహిళ పోలీస్ స్టేషన్‌కు వచ్చినట్టు తెలుస్తోంది. దీనిని ఆసరాగా చేసుకున్న శశిభూషణ్ తనకు మసాజ్ చేయమని ఆమెను అడగడంతోపాటు ఆమె కుమారుడిని జైలు నుంచి విడిపిస్తానని హామీ ఇచ్చారు. దీంతో ఆమె మసాజ్ చేస్తుండగానే సిన్హా ఓ లాయర్‌కు ఫోన్ చేసి ఆమె కుమారుడిని బెయిలుపై బయటకు తీసుకురావాలని కోరారు. 


‘‘ఆమె చాలా పేదరాలు. ఎంత డబ్బు పంపాలి? ఓ ఎన్వలప్‌లో ఆ సొమ్ము పెట్టి పంపిస్తాం. నీ దగ్గరికి ఇద్దరు మహిళలు వారి ఆధార్‌కార్డులు తీసుకుని వస్తారు. అడ్రసు, ఫోన్ నంబరు ఇచ్చి సోమవారం నీ దగ్గరికి పంపిస్తా. పప్పు బాపు.. రిక్వెస్ట్ చేస్తున్నా.. నేను ఇప్పటికే రూ. 10 వేలు ఖర్చు చేశా’’ అని సిన్హా ఓ లాయర్‌తో మాట్లాడడం ఆ వీడియోలో వినిపిస్తోంది. ఈ వీడియో వైరల్ అయిన తర్వాత సహస్ర ఎస్పీ లిపి సింగ్ తక్షణం స్పందించారు. శశిభూషణ్‌ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.  



Updated Date - 2022-04-29T23:37:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising