ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెనక్కి మళ్లిన సముద్రం

ABN, First Publish Date - 2022-01-19T17:12:48+05:30

ప్రముఖ పర్యాటక ప్రాంతం కన్నియా కుమారి తీరంలో మంగళవారం ఉదయం సముద్రం వెనక్కిమళ్లింది. దీంతో సముద్రపునీటిలో ఉండే బండరాళ్లన్నీ బయటకు వచ్చాయి. సునామీ ఉపద్రవం సంభవించిన 2004 నుంచి ఈ తీరంలో తరచూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                            - బయల్పడిన బండరాళ్లు


చెన్నై: ప్రముఖ పర్యాటక ప్రాంతం కన్నియా కుమారి తీరంలో మంగళవారం ఉదయం సముద్రం వెనక్కిమళ్లింది. దీంతో సముద్రపునీటిలో ఉండే బండరాళ్లన్నీ బయటకు వచ్చాయి. సునామీ ఉపద్రవం సంభవించిన 2004 నుంచి ఈ తీరంలో తరచూ సముద్రపు జలాలు వెనక్కి వెళ్ళటం ఆనవాయితీగా మారింది. అదే విధంగా అలల సందడి లేకుండా సముద్రం అప్పుడప్పుడూ నదిలా కనబడటమూ జరుగుతోంది. అదేవిధంగా రాక్షస అలలు ఎగసిపడి తీరం ముందుకు దూసుకు రావటమూ జరుగుతోంది. అమావాస్య, పౌర్ణమి దినాల్లో ఇక్కడి సముద్రం కల్లోలంగా మారుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం సముద్రం సుమారు 50 అడుగుల మేర వెనక్కిమళ్ళింది. దీనితో తీరంలోని ఉన్న బండరాళ్లు, ఇసుక మేటలు కనిపించడంతో పర్యాటకులు, స్థానికులు భీతిల్లారు. ఈ మార్పులను పట్టించుకోకుండా జాలర్లు ఎప్పటివలెనే నాటుపడవలు, మర పడవలతో సముద్రంలో చేపలవేటకు బయలుదేరారు.

Updated Date - 2022-01-19T17:12:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising