ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తీర ప్రాంతాల్లో Red Alert

ABN, First Publish Date - 2022-06-23T16:33:31+05:30

రాష్ట్రంలో సముద్ర తీరానికి అనుబంధంగా ఉండే మూడు జిల్లాల్లోనూ బుధవారం రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. ఇప్పటికే పది రోజులకు పైగా ఎడతెరపి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- సముద్రంలో చేపలవేట నిషేధం

- మరో మూడు రోజులు భారీ వర్షాలు


బెంగళూరు, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సముద్ర తీరానికి అనుబంధంగా ఉండే మూడు జిల్లాల్లోనూ బుధవారం రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. ఇప్పటికే పది రోజులకు పైగా ఎడతెరపి లేకుండా వర్షా లు కురుస్తున్నాయి. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ పరిశోధనా విభాగం సూచించింది. దీంతో ముందస్తు చర్యల్లో భాగంగా ఉత్తరకన్నడ, ఉడుపి, దక్షిణకన్నడ జిల్లాల వ్యాప్తంగా రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. సముంద్రంలో చేపల వేటను నిషేధించారు. తొలుత రెండురోజుల పాటు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించగా ఆ తర్వాత నాలుగురోజుల పాటు ఆరెంజ్‌ అలర్ట్‌ అమలులో ఉండనుంది. ఉత్తరకన్నడ జిల్లాకేంద్రం కారవారలో చర్చిరోడ్‌,  రైల్వేస్టేషన్‌, నందనగద్దె వంటి ప్రాంతాలు జలావృతమయ్యాయి. రవీంద్రనాథ్‌ఠాగూర్‌ బీచ్‌తో పాటు 66వ నంబరు జాతీయ రహదారి నీట మునిగింది. గంటల తరబడి వాహనాలు ముందుకు కదిలే పరిస్థితి లేకుండా పోయింది. వాతావరణ పరిశోధనా విభాగం అధికారులు తెలిపిన మేరకు తీర ప్రాంత జిల్లాల్లో ఈనెల 25వ తేదీ వరకూ భారీగా వర్షాలు కురవనున్నాయి.

Updated Date - 2022-06-23T16:33:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising