ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Security Lapse: షా పర్యటనలో భద్రతా లోపం.. వైసీపీ ఎంపీ వ్యక్తిగత కార్యదర్శి అరెస్ట్

ABN, First Publish Date - 2022-09-08T17:53:26+05:30

ముంబై: కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ముంబై పర్యటనలో భద్రతా లోపం ఏర్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ముంబై పర్యటనలో భద్రతా లోపం ఏర్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హోంశాఖ అధికారిని అంటూ హేమంత్ పవార్ అనే వ్యక్తి హోంశాఖ ఐడీకార్డుతో గంటల తరబడి షాకు అతి సమీపంలో తిరిగాడు. అంతేకాదు తాను బందోబస్తు చూసేందుకు వచ్చానని నమ్మబలికాడు. షా పాల్గొన్న రెండు కార్యక్రమాలకూ హేమంత్ పవార్ వచ్చాడు. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నివాసాల వద్ద కూడా కనిపించాడు. హోం మంత్రిత్వ శాఖ జాబితాలో హేమంత్ పవార్ పేరు లేదని గుర్తించిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. కోర్టు అతడికి ఐదురోజుల పోలీస్ కస్టడీ విధించింది.


హేమంత్ పవార్ లక్ష్యమేంటి? అతడి వెనుక ఎవరెవరున్నారు అనే అంశాలపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. అరెస్టైన వ్యక్తి వైసీపీ ఎంపీ అనూరాధకు వ్యక్తిగత కార్యదర్శిగా భావిస్తున్నారు. పోలీసుల విచారణ తర్వాత మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.  

Updated Date - 2022-09-08T17:53:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising