ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Republic Day వేడుకల్లో ప్రధానిపై ఉగ్రదాడి ముప్పు...ఇంటెలిజెన్స్ హెచ్చరిక

ABN, First Publish Date - 2022-01-18T17:58:07+05:30

ఈ నెల 26వతేదీన జరగనున్న రిపబ్లిక్ డే వేడుకలకు హాజరయ్యే ప్రధానమంత్రి నరేంద్రమోదీతోపాటు ఇతర ప్రముఖులకు ఉగ్రవాద దాడుల ముప్పు పొంచి ఉందని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఈ నెల 26వతేదీన జరగనున్న రిపబ్లిక్ డే వేడుకలకు హాజరయ్యే ప్రధానమంత్రి నరేంద్రమోదీతోపాటు ఇతర ప్రముఖులకు ఉగ్రవాద దాడుల ముప్పు పొంచి ఉందని కేంద్ర ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. ప్రధానితోపాటు ఇతర వీవీఐపీల ప్రాణాలకు ముప్పు కలిగించే ఉగ్ర దాడుల కుట్ర గురించి ఇంటెలిజెన్స్ ఏజెన్సీ 9 పేజీల హెచ్చరికను తాజాగా జారీ చేసింది. భారతదేశ 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఐదు మధ్య ఆసియా దేశాలైన కజకిస్తాన్, కిర్గిజ్స్తాన్, తజికిస్తాన్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ నాయకులను ముఖ్య అతిథులుగా ఆహ్వానించే అవకాశం ఉంది.పాకిస్థాన్,అఫ్ఘానిస్థాన్ ప్రాంతానికి చెందిన ఉగ్రవాద గ్రూపుల నుంచి ముప్పు వచ్చిందని ఇంటెలిజెన్స్ నోట్ పేర్కొంది. 


ఉగ్రవాదులు ఉన్నత స్థానంలో ఉన్న ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని బహిరంగ సభల్లో విధ్వంసం కలిగించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.లష్కరే తోయిబా, ది రెసిస్టెన్స్ ఫోర్స్, జైషే మహ్మద్, హర్కత్ ఉల్ ముజాహిదీన్, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్రవాద గ్రూపులు ఈ ఉగ్ర కుట్ర వెనుక ఉన్నాయని ఇంటెలిజెన్స్ పేర్కొంది.పాకిస్థాన్‌లో ఉన్న ఖలిస్తానీ గ్రూపులు పంజాబ్‌లో మిలిటెన్సీని పునరుద్ధరింపజేసేందుకు క్యాడర్‌లను కూడా సమీకరించుకుంటున్నాయని ఇంటెలిజెన్స్ తెలిపింది. ఖలిస్తానీ టెర్రర్ గ్రూపులు ప్రధానమంత్రి  సమావేశ వేదికలపై దాడికి ప్లాన్ చేస్తున్నాయని కేంద్ర ఇంటెలిజెన్స్ హెచ్చరించింది.హైఅలర్ట్ ప్రకటించడంతో పాటు ఎర్రకోట వద్ద భారీ సాయుధ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Updated Date - 2022-01-18T17:58:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising