ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యోగి కేబినెట్‌‌లో రెండో వికెట్: బీజేపీకి దారా సింగ్ గుడ్‌బై

ABN, First Publish Date - 2022-01-12T22:19:00+05:30

నేను చాలా ఉత్సాహంతో పని చేశాను. కానీ ప్రభుత్వ విధానాలు అందుకు అనుగుణంగా నాకు మద్దతు ఇవ్వలేదు. రైతులు, ఓబీసీలు, దళితుల కోసం ఎంతో చేయాలని అనుకున్నాను. దళితులు, ఓబీసీల మద్దతుతోనే బీజేపీ అధికారంలోకి వచ్చింది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లఖ్‌నవూ: స్వామి ప్రసాద్ మౌర్య తన మంత్రి పదవికి, భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసి 24 గంటలు గడవకముందే యోగి కేబినెట్‌లో మరొక వికెట్ పడింది. మంత్రి దారా సింగ్ చౌహాన్ తన మంత్రి పదవికి భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు. యోగి కేబినెట్ నుంచి తప్పుకున్న ఇరువురు నేతలూ ఓబీసీ వర్గానికే చెందినవారు కావడం గమనార్హం. వచ్చే నెలలోనే ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఉండడంతో బీజేపీకి ఇది పెద్ద ఎదురు దెబ్బ అనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.


అయితే బీజేపీకి రాజీనామా చేయడం గురించి చౌహాన్ స్పందించారు. ‘‘నేను చాలా ఉత్సాహంతో పని చేశాను. కానీ ప్రభుత్వ విధానాలు అందుకు అనుగుణంగా నాకు మద్దతు ఇవ్వలేదు. రైతులు, ఓబీసీలు, దళితుల కోసం ఎంతో చేయాలని అనుకున్నాను. దళితులు, ఓబీసీల మద్దతుతోనే బీజేపీ అధికారంలోకి వచ్చింది. కానీ, ఆ వర్గాలకు చేసింది ఏమీ లేదు. అందుకే నేను రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. తర్వాత ఏంటనేది ఇప్పుడే చెప్పలేను. మా సొసైటీ ప్రజలతో మాట్లాడి భవిష్యత్‌పై నిర్ణయం తీసుకుంటాను’’ అని చౌహాన్ అన్నారు.


అయితే ధారా సింగ్ రాజీనామాపై ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య స్పందిస్తూ ‘‘కుటుంబ సభ్యులు దారి తప్పడం నిజంగా బాధాకరం. మా కుటుంబ (పార్టీ) సభ్యులందరికీ విజ్ణప్తి చేస్తున్నాను. దయలచేసి మునిగిపోతున్న నావలోకి వెళ్లకండి. అన్నగారు ధారా సింగ్ తన నిర్ణయంపై పునరాలోచిస్తారని అనుకుంటున్నాను’’ అని అన్నారు.


ఉత్తరప్రదేశ్‌లోని 403 సీట్లు అసెంబ్లీ స్థానాలకు ఏడు విడతల్లో ఎన్నికలు జరుగనున్నాయి. తొలి విడత పోలింగ్ ఫిబ్రవరి 10న జరుగుతుంది. అనంతరం ఫిబ్రవరి 14,20,23,27, మార్చి 3, 7వ తేదీల్లో జరిగే పోలింగ్‌తో ఓటింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. మార్చి 10న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. కాగా, 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 312 సీట్లతో ఘన విజయం సాధించింది. 39.67 శాతం ఓట్ల షేర్ సాధించింది. సమాజ్‌వాదీ పార్టీ 47, బీఎస్‌పీ 19, కాంగ్రెస్ 7 సీట్లు గెలుచుకున్నాయి.

Updated Date - 2022-01-12T22:19:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising