ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హన్స్‌ఖలీ అత్యాచారం కేసులో మరో వ్యక్తి అరెస్టు

ABN, First Publish Date - 2022-04-12T20:24:15+05:30

పశ్చిమబెంగాల్‌లోని నదియా జిల్లా హన్స్‌ఖాలీ ప్రాంతంలో సంచలనం సృష్టించి మైనర్ బాలిక అత్యాచారం కేసులో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లోని నదియా జిల్లా హన్స్‌ఖలీ ప్రాంతంలో సంచలనం సృష్టించి మైనర్ బాలిక అత్యాచారం కేసులో అనుమానితుడిగా భావిస్తున్న మరో వ్యక్తిని పోలీసులు మంగళవారం ఉదయం అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడికి అతను స్నేహితుడని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. మరో ఇద్దరిని కూడా పోలీసులు నిర్బంధంలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు ఆయన చెప్పారు.


ఈనెల 4వ తేదీన బర్త్‌డే పార్టీకి హాజరైన సమయంలో మైనర్ బాలిక అత్యాచారానికి గురైంది. తీవ్రమైన రక్తస్రావంతో ఆ మరుసటి రోజు బాలిక కన్నుమూసింది. ఈమేరకు బాలిక తల్లిదండ్రులు ఈనెల 9న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వెనువెంటనే ఈ కేసులో ప్రధాన నిందితుడిని అరెస్టు చేశారు. అతను టీఎంసీ నేత కుమారుడిగా గుర్తించారు. టీఎంసీ నేత ఒత్తిడి మేరకే శవపరీక్ష చేయకుండా మృతదేహాన్ని దహనం చేసినట్టు బాధిత కుటుంబీకుల ఆరోపణగా ఉంది. ఈ ఘటనపై బీజేపీ 12 గంటల బంద్‌కు పిలుపునివ్వగా, హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం కూడా దాఖలైంది.

Updated Date - 2022-04-12T20:24:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising