ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికల సంఘం బానిసలా పని చేస్తోంది: బీజేపీ నేత

ABN, First Publish Date - 2022-03-02T21:54:53+05:30

టీఎంసీకి ఎస్‌ఈసీ (స్టేట్ ఎలక్షన్ కమిషనర్) సౌరభ్ దాస్ బానిస. ఆయనకంటూ సొంత వ్యక్తిత్వం, సొంత ఆలోచనలు లేవు. రాష్ట్రంలో ఎన్నికలు నిష్పాక్షికంగా జరగాలని కోర్టులో మేము పిటిషన్ వేస్తే కొట్టేశారు. కేంద్ర బలగాలను రాష్ట్రంలో పెద్ద మొత్తంలో దింపి ఉంటే ఎన్నికలు నిష్పాక్షికంగా జరిగేవి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా: మమతా బెనర్జీకి పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తిగా బానిసగా మారిపోయిందని భారతీయ జనతా పార్టీ నేత అనిర్బాన్ గంగూలీ ఆరోపించారు. రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఈరోజు విడుదల అవుతున్నాయి. ఈ ఫలితాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దిశగా పయనిస్తోంది. ఈ సందర్భంలోనే గంగూలీ పై విధంగా ఆరోపణలు చేయడం గమనార్హం.


‘‘టీఎంసీకి ఎస్‌ఈసీ (స్టేట్ ఎలక్షన్ కమిషనర్) సౌరభ్ దాస్ బానిస. ఆయనకంటూ సొంత వ్యక్తిత్వం, సొంత ఆలోచనలు లేవు. రాష్ట్రంలో ఎన్నికలు నిష్పాక్షికంగా జరగాలని కోర్టులో మేము పిటిషన్ వేస్తే కొట్టేశారు. కేంద్ర బలగాలను రాష్ట్రంలో పెద్ద మొత్తంలో దింపి ఉంటే ఎన్నికలు నిష్పాక్షికంగా జరిగేవి. కానీ పిటిషన్ కొట్టేయడం వల్ల అది సాధ్యం కాలేదు. సుప్రీంకోర్టు, హైకోర్టు దీనిపై ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నల్లోనే ఎస్‌ఈసీ పని చేస్తున్నారు. ప్రజలను భయపెట్టి టీఎంసీ ఓట్లు సంపాదిస్తోంది. లేదంటే ఒక్క మున్సిపాలిటీని కూడా మమతా బెనర్జీ గెలవలేరు’’ అని అనిర్బాన్ అన్నారు.

Updated Date - 2022-03-02T21:54:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising