ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాఠశాలల్లో Cell Phones వాడితే కఠిన చర్యలు

ABN, First Publish Date - 2022-06-14T18:26:49+05:30

పాఠశాల సమయంలో ఉపాధ్యాయులు మొబైల్‌ ఫోన్లను ఉపయోగించరాదని అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ పవన్‌కుమార్‌ మాలపాటి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బళ్లారి(బెంగళూరు), జూన్‌ 13: పాఠశాల సమయంలో ఉపాధ్యాయులు మొబైల్‌ ఫోన్లను ఉపయోగించరాదని అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ పవన్‌కుమార్‌ మాలపాటి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. బళ్లారిలోని శ్రీరాంపుర కాలనీలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాల, ప్రభుత్వ ఉర్దూ పాఠశాలలను జిల్లా కలెక్టర్‌ పవన్‌కుమార్‌ మాలపాటి, ఎస్పీ సైదులు అదావత్‌ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ పాఠశాల ఆవరణలో మద్యం సీసాలు, చెత్తాచెదారం పడి ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానోపాద్యాయుడికి నోటీసులు జారీ చేయాలని డీడీపీఐ అందానప్పను ఆదేశించారు. పాఠశాల ఆవరణ పరిశుభ్రంగా ఉంచడానికి చర్యలు తీసుకోవాలన్నారు. తదనంతరం పాఠశాల గదులను పరిశీలించి అక్కడి పిల్లలను ఉద్దేశించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. పాఠశాలల్లో మొబైల్‌ పోన్లను వాడరాదని పోన్లను ప్రధాన ఉపాధ్యాయుని గదిలో ఉంచేటట్లు సర్క్యులర్‌ జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కాలనీ రోడ్లను పరిశీలించి అవసరమెన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Updated Date - 2022-06-14T18:26:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising