ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

SC: అనిల్ దేశ్‌ముఖ్ బెయిల్ అభ్యర్థన తీవ్ర జాప్యంపై సుప్రీంకోర్టు అసంతృప్తి

ABN, First Publish Date - 2022-09-27T00:16:21+05:30

మహారాష్ట్ర మాజీ హోం మంత్రి, ఎన్‌సీపీ (NCP) నేత అనిల్ దేశ్‌ముఖ్ (Anil Deshmukh) బెయిల్ అభ్యర్థన 8 నెలలుగా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: మహారాష్ట్ర మాజీ హోం మంత్రి, ఎన్‌సీపీ (NCP) నేత అనిల్ దేశ్‌ముఖ్ (Anil Deshmukh) బెయిల్ అభ్యర్థన 8 నెలలుగా పెండింగ్‌లో ఉండటంపై సుప్రీంకోర్టు సోమవారంనాడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. త్వరిగతిన బెయిల్ పిటిషన్‌పై  నిర్ణయం తీసుకోవాలని ముంబై హైకోర్టును అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ వారం చివరలోగా ఓ నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. ఈ కేసు మంచిచెడ్డలపై తాము విశ్లేషణ చేయదలచుకోలేదని ధర్మాసనం స్పష్టం చేసింది. మనీలాండరింగ్ కేసులో దేశ్‌ముఖ్ అరెస్టు కాగా, ఆయన బెయిల్ దరఖాస్తు మార్చి 21వ తేదీ నుంచి హైకోర్టు వద్ద పెండింగ్‌లో ఉందని న్యాయమూర్తులు డీవై చంద్రచూడ్, హిమా  కోహ్లిలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది.


''ఏ వ్యక్తి అయినా బెయిల్ దరఖాస్తు చేసుకుంటే సాధ్యమైనంత త్వరగా తన అభ్యర్థనను పరిశీలిస్తారనే అంచనా వారికి ఉంటుంది. ఆర్టికల్-21 జీవించే హక్కు కింద బెయిల్ అప్లికేషన్‌ను స్థిరంగా నిలిపి ఉంచరాదు'' అని బెంచ్ పేర్కొంది. మంగళవారం కేసు ఏ జడ్జి ముందుకు వస్తుందో ఆ జడ్జి ముందు పిటిషన్‌దారు దరఖాస్తు చేసుకునేందుకు అనుమతిస్తున్నాం. ఈ వారంలోనే విచారణ చేపట్టి త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని ఆదేశిస్తున్నాం'' అని ధర్మాసనం సృష్టం చేసింది. అనిల్ దేశ్‌ముఖ్ బెయిల్ పిటిషన్‌ ప్రస్తుతం హైకోర్టు న్యాయమూర్తి ఎన్‌జే జమాదార్ ముందు విచారణలో ఉంది. 2021 నవంబర్‌లో అనిల్ దేశ్‌ముఖ్‌ను ఈడీ అరెస్టు చేయగా, ప్రస్తుతం ఆయన జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు.

Updated Date - 2022-09-27T00:16:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising