ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hijab Ban: కర్ణాటక హైకోర్టు ఉత్తర్వుపై విచారణకు సుప్రీం బెంచ్

ABN, First Publish Date - 2022-08-02T21:09:36+05:30

కర్ణాటక విద్యాసంస్థల్లో హిజాబ్‌పై విధించిన నిషేధాన్ని ఎత్తివేసేందుకు ఆ రాష్ట్ర హైకోర్టు నిరాకరించడాన్ని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కర్ణాటక విద్యాసంస్థల్లో హిజాబ్‌పై విధించిన నిషేధాన్ని (Hijab ban) ఎత్తివేసేందుకు ఆ రాష్ట్ర హైకోర్టు నిరాకరించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై విచారణకు ధర్మాసనం (Bench) ఏర్పాటు చేస్తామని సుప్రీంకోర్టు (Supreme court) మంగళవారంనాడు తెలిపింది. జడ్జిలలో ఒకరి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో కేసు విచారణలో జాప్యం తలెత్తిందని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.


హైకోర్టు ఉత్తర్వులపై గత మార్చిలోనే అప్పీలు చేసినప్పటికీ ఇప్పటి వరకూ లిస్టింగ్‌కు రాలేదని అప్పీలుదారు తరఫున కోర్టుకు హాజరైన సీనియర్ న్యాయవాది మీనాక్షి అరోరా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణ, న్యాయమూర్తులు కృష్ణమురారి, హిమ కోహ్లితో కూడిన ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై సీజేఐ మాట్లాడుతూ, ఒక బెంచ్ ఏర్పాటు చేస్తానని, న్యాయమూర్తుల్లో ఒకరికి ఒంట్లో బాగోలేదనని చెప్పారు. ''కాస్త ఓపిక పట్టండి. న్యాయవాదులు కాస్త కుదురుకున్న వెంటనే ఈ అంశం విచారణకు తీసుకువస్తాం'' అని సీజేఐ అన్నారు.


దీనికి ముందు, కర్ణాటక హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై జూలై 13న విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. విద్యార్థినులు తమ చదువులు కోల్పోతున్నారని, అనేక కష్టాలు ఎదుర్కోవలసి వస్తోందని న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కోర్టు దృష్టికి తెచ్చారు. తరగతి గదుల్లో హిజాబ్ ధరించేందుకు అనుమతించాలంటూ వేసిన పిటిషన్లను కర్ణాటక హైకోర్టు గత మార్చి 15న కొట్టివేసింది. హిజాబ్ మతపరమైన ఆచారమేమీ కాదని తీర్పులో పేర్కొంది. ఈ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి.

Updated Date - 2022-08-02T21:09:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising