ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అజంఖాన్ ట్రస్ట్ వర్శిటీ భూమి స్వాధీనంపై సుప్రీంకోర్టు స్టే

ABN, First Publish Date - 2022-04-18T21:41:09+05:30

రాంపూర్‌లోని మొహమ్మద్ అలి జౌహర్ యూనివర్శిటీకి కేటాయించిన భూమిని స్వాధీనం చేసుకునేందుకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో: రాంపూర్‌లోని మొహమ్మద్ అలి జౌహర్ యూనివర్శిటీకి కేటాయించిన భూమిని స్వాధీనం చేసుకునేందుకు అనుమతిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు సోమవారంనాడు స్టే ఇచ్చింది. సమాజ్‌వాదీ పార్టీ నేత అజంఖాన్ సారథ్యంలోని మౌలానా మొహమ్మద్ అలి జౌహర్ ట్రస్టు ఆధ్వరంలో ఈ యూనివర్శిటీ నడుస్తోంది. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ మౌలానా మొహమ్మద్ అలీ జౌహర్ ట్రస్టు వేసిన పిటిషన్‌పై జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ సీటీ రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం నోటీసులు ఇచ్చింది. ఆగస్టులో ఈ కేసు తదుపరి విచారణను జరుపనుంది.


ఇన్‌స్టిట్యూషన్ కోసం 2005లో మంజూరు చేసిన భూమికి సంబంధించిన కొన్ని షరతులను పాటించలేదంటూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం యూనివర్శిటీ భూమిని స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీనిని వ్యతిరేకిస్తూ యూనివర్శిటీ వేసిన పిటిషన్‌ను గత సెప్టెంబర్‌లో అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. సమాజ్‌వాదీ  పార్టీ ముస్లిం నేతగా గట్టి పట్టు ఉన్న అజాంఖాన్ ప్రస్తుతం సీతాపూర్ జైలులో ఉన్నారు.

Updated Date - 2022-04-18T21:41:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising