ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రాల్లో Demolitions పై తాత్కాలిక స్టే ఇచ్చేందుకు Suprem court నిరాకరణ

ABN, First Publish Date - 2022-07-13T21:56:00+05:30

దేశంలోని పలు రాష్ట్రాల్లో జరుగుతున్న కూల్చివేతలను (Demolitions) నిలిపివేస్తూ తాత్కాలికంగా స్టే (Interm stay) ఇచ్చేందుకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశంలోని పలు రాష్ట్రాల్లో జరుగుతున్న కూల్చివేతలను (Demolitions) నిలిపివేస్తూ తాత్కాలికంగా స్టే (Interim stay) ఇచ్చేందుకు సుప్రీంకోర్టు (Supreme court) బుధవారంనాడు నిరాకరించింది. అధికారులను చర్యలు తీసుకోకుండా నిలువరిస్తూ ''గంపగుత్త ఆదేశాలు'' (Omnibus order) ఇవ్వలేమని న్యాయమూర్తులు బీఆర్ గవాయ్, పీఎస్ నరసింహతో కూడిన ధర్మాసనం తెలిపింది. ఆగస్టు 10న జరిగిన కూల్చివేతకు వ్యతిరేకంగా Jamait Ulama-I-HInd వేసిన పిటిషన్‌పై విచారణ చేస్తామని చెప్పింది.


''చట్టాన్ని పాటించాలి. దానిపై ఎలాంటి వివాదం లేదు. మమ్మల్ని గంపగుత్త ఆదేశాలు ఇమ్మంటారా? అలాంటి ఆదేశాలు ఇచ్చినట్టయితే చట్టాన్ని అతిక్రమించే వారిపై చర్యలు తీసుకోకుండా అధికారులను నిలువరించినట్టు కాదా'' అని ధర్మాసనం ప్రశ్నించింది. ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనల్లో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి ఆస్తులను కూల్చివేయకుండా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, ఇతర రాష్ట్రాలని ఆదేశించాలని కోరుతూ Jamait Ulama-I-HInd వేసిన పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం విచారణ జరుపుతోంది.

Updated Date - 2022-07-13T21:56:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising