ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bilkis Bano: సుప్రీంలో బిల్కిస్ బానో రివ్యూ పిటిషన్ కొట్టివేత

ABN, First Publish Date - 2022-12-17T11:33:12+05:30

బిల్కిస్ బానో రివ్యూ పిటిషన్ విషయంలో శనివారం సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది....

SC dismisses Bilkis Banos plea
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : బిల్కిస్ బానో రివ్యూ పిటిషన్ విషయంలో శనివారం సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. 2002వ సంవత్సరంలో సామూహిక అత్యాచారం చేసి, కుటుంబ సభ్యులను హత్య చేసిన కేసులో దోషులుగా తేలిన 11 మందిని త్వరగా విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ బిల్కిస్ బానో(Bilkis Banos) దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను (review plea)సుప్రీంకోర్టు శనివారం కొట్టివేసింది.(SC dismisses)ఈ కేసులో 11 మంది నిందితులు 2008లో దోషులుగా తేలారు. దీంతో వారికి కోర్టు జీవితఖైదు విధించింది.ఈ కేసులో 2008లో దోషులుగా తేలిన 11 మంది వ్యక్తులు ఆగస్టు 15న గోద్రా సబ్ జైలు నుంచి బయటికి వచ్చారు. గుజరాత్ ప్రభుత్వం రిమిషన్ పాలసీ ప్రకారం వారిని విడుదల చేయడానికి కోర్టు అనుమతించింది.

గుజరాత్‌లో గోద్రా రైలు దహనం ఘటన తర్వాత చెలరేగిన అల్లర్లలో నుంచి పారిపోతూ సామూహిక అత్యాచారానికి గురైనప్పుడు బిల్కిస్ బానో వయస్సు 21 సంవత్సరాలు. ఐదు నెలల గర్భిణి. చనిపోయిన ఏడుగురు కుటుంబ సభ్యుల్లో ఆమె మూడేళ్ల కూతురు కూడా ఉంది.ముందస్తు విడుదలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌లకు ప్రతిస్పందనగా గుజరాత్ ప్రభుత్వం సుప్రీంలో అఫిడవిట్ దాఖలు చేసింది. 11 మంది దోషుల సత్ప్రవర్తనపై 14 సంవత్సరాల జైలు శిక్షను పూర్తి చేసిన తర్వాత, కేంద్ర ప్రభుత్వ ఆమోదం తర్వాత విడుదలయ్యారని తెలియజేస్తూ సుప్రీంకి గుజరాత్ సర్కారు అఫిడవిట్ దాఖలు చేసింది.

Updated Date - 2022-12-17T11:40:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising