ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ ఏడాది Hajj యాత్రకు 10లక్షలమందికి అనుమతి

ABN, First Publish Date - 2022-04-09T18:19:45+05:30

ఈ ఏడాది హజ్ యాత్రకు సౌదీ అరేబియా ప్రభుత్వం 10లక్షల మంది యాత్రికులను అనుమతించనుంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఈ ఏడాది హజ్ యాత్రకు సౌదీ అరేబియా ప్రభుత్వం 10లక్షల మంది యాత్రికులను అనుమతించనుంది.సౌదీ అరేబియా ప్రభుత్వం కొవిడ్-19 టీకాలు వేయించుకున్న 65 ఏళ్ల వయసు లోపు వారికి తీర్థయాత్రకు అనుమతించనున్నట్లు సౌదీ సర్కారు శనివారం ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది అత్యధిక సంఖ్యలో ముస్లింలు హజ్ చేయగలరని నిర్ధారిస్తూనే యాత్రికుల భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటోంది.కేటాయించిన కోటాల ఆధారంగా ప్రతి దేశం నుంచి నిర్దిష్ట సంఖ్యలో యాత్రికులు తీర్థయాత్ర చేయడానికి అనుమతించనున్నారు.సౌదీ అరేబియా వెలుపలి నుంచి వచ్చే వారు 72 గంటలలోపు ఆర్టీపీసీఆర్ కొవిడ్ పరీక్ష ప్రతికూల ఫలితాన్ని సమర్పించవలసి ఉంటుంది.


ఇస్లాం యొక్క ఐదు మూల స్తంభాల్లో ఒకటైన హజ్ ముస్లింలందరూ తమ జీవితంలో ఒక్కసారైనా తప్పనిసరిగా చేపట్టాలి. ప్రపంచంలోని అతిపెద్ద మతపరమైన సమావేశాలలో హజ్ యాత్ర ఒకటి. 2019వ సంవత్సరంలో దాదాపు 2.5 మిలియన్ల మంది హజ్ యాత్రికులు పాల్గొన్నారు.కానీ 2020లో కరోనావైరస్ మహమ్మారి ప్రారంభమైన తర్వాత సౌదీ అధికారులు కేవలం 1,000 మంది యాత్రికులను మాత్రమే హజ్ యాత్రకు అనుమతించారు. 2021లో సౌదీ అధికారులు లాటరీ ద్వారా 60వేలమంది భక్తులను ఎంపిక చేశారు.


Updated Date - 2022-04-09T18:19:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising