ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంతోష్ పాటిల్‌ ఆత్మహత్య కేసు.. విచారణ వేగవంతం

ABN, First Publish Date - 2022-04-17T16:59:21+05:30

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన కాంట్రాక్టర్‌ సంతోష్ పాటిల్‌ ఆత్మహత్య కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. సంతోష్ పాటిల్‌ ఆత్మహత్యకు క్రిమిసంహారక మందు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                      - క్రిమిసంహారక మందు సేవించడంతోనే మృతి


బెంగళూరు: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన కాంట్రాక్టర్‌ సంతోష్ పాటిల్‌ ఆత్మహత్య కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. సంతోష్ పాటిల్‌ ఆత్మహత్యకు క్రిమిసంహారక మందు సేవించడమే కారణమని పోలీసుల విచారణలో తేలింది. నిషేధిత క్రిమిసంహారక మందును చిక్కమగళూరులో కొనుగోలు చేసిన సంతోష్‌ ఉడుపిలోని లాడ్జిలో కూల్‌ డ్రింక్‌లో కలిపి సే వించడమే మృతికి కారణమని పోలీసులు నిర్ధారించారు. లాడ్జిలోని గదిలో చెత్తబుట్టలో క్రిమిసంహారక మం దుకు సంబంధించిన బాటిల్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఫోరెన్సిక్‌ నిపుణులకు పంపారు. కొన్నేళ్లుగా సదరు మందును నిషేధించారు. అయినా చిక్కమగళూరులో ఎలా లభించిందనే కోణంలో విచారణ సాగుతోంది. కాంట్రాక్టర్‌ సంతోష్ పాటిల్‌ ఆత్మహత్యకు ముందు చిక్కమగళూరులోని హోం స్టేలో బస చేశారు. అతడు నవీన్‌ అనే వ్యక్తి రిజర్వు చేసిన హోం స్టేలో ఏప్రిల్‌ 8 నుంచి ఉన్నారు. 9న ఉదయం ముల్లయ్యగిరికి మిత్రుడితో కలసి వెళ్లిన సంతోష్‌ రాత్రికి హోం స్టేకు వచ్చారు. ఆ తర్వాత రోజు ఖాళీ చేసి వెళ్లిన సంతోష్‌ అదే రోజురాత్రి మరోసారి హోం స్టే చేరారు. 11న అక్కడనుంచి ఉడుపి వెళ్లి లాడ్జిలో గది తీ సుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. మూడు రోజులపాటు హోం స్టేలో సంతోష్‌ ఎవరితో కలసి ఉన్నారనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. హోం స్టేలోని సీసీ కెమెరా ల ఫుటేజీలను స్వాధీనం చేసుకున్నారు. కాగా విచారణ వేగవంతం చేశారు. అదనపు డీజీ ప్రతా్‌పరెడ్డి ఉడుపికి చేరుకుని కేసు పురోగతిని సమీక్షించా రు. శనివారం ఉదయం బణ్ణంజె ఎస్పీ కార్యాలయంలో రెండు గంటలపాటు ఇప్పటిదాకా సాగిన వివరాలను ఆరా తీశారు. కుందాపుర, బ్రహ్మావర, మల్పె, మణిపాల్‌ ఇన్‌స్పెక్టర్‌ల నేతృత్వంలో నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు. 

Updated Date - 2022-04-17T16:59:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising