ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫుల్‌ కిక్‌... మూడు రోజుల్లో రూ.675 కోట్ల మద్యం విక్రయం

ABN, First Publish Date - 2022-01-17T13:19:32+05:30

పొంగల్‌ సందర్భంగా ప్రభుత్వ నిర్వహణలోని టాస్మాక్‌ దుకాణాల్లో ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు రూ.675 కోట్ల మేర మద్యం విక్రయాలు జరిగాయి. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.540 కోట్ల ఆదాయం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                    - ప్రభుత్వానికి 540 కోట్ల ఆదాయం


ప్యారీస్‌(చెన్నై): పొంగల్‌ సందర్భంగా ప్రభుత్వ నిర్వహణలోని టాస్మాక్‌ దుకాణాల్లో ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు రూ.675 కోట్ల మేర మద్యం విక్రయాలు జరిగాయి. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.540 కోట్ల ఆదాయం గిట్టింది. టాస్మాక్‌ సంస్థ ఆధీనంలో వున్న చిల్లర దుకాణాలలో రోజువారీగా సుమారు రూ.100 కోట్ల మేర, సెలవు రోజుల్లో దీనికంటే రెండింతల విక్రయాలు జరుగుతుంటాయి. పొంగల్‌ పండుకు వరుస సెలవులు ప్రకటించడంతో మందుబాబులు ముందుగానే తమకు అవసరమైన మద్యం రకాలను కొనుగోలు చేశారు. ఈ ఏడాది తిరువళ్లువర్‌ దినోత్సవం సందర్భంగా శనివారం, ఆదివారం సంపూర్ణ లాక్‌డౌన్‌ కావడంతో మద్యం దుకాణాలు మందుబాబులు ముందుగానే సరకును కొనుగోలు చేసి తమ వద్ద వుంచుకున్నారు. పండుగ సీజన్‌లో అధిక మద్యం విక్రయించాలన్న లక్ష్యంతో గోదాముల నుంచి అన్ని టాస్మాక్‌ దుకాణాలకు భారీగా సరఫరా చేసింది. దీంతో 12వ తేదీన రూ.155 కోట్లు, 13న రూ.203 కోట్లు, 14న రూ.317 కోట్లు చొప్పున మొత్తం ఈ మూడు రోజుల్లో రూ.675 కోట్లు మద్యం విక్రయించింది. 

Updated Date - 2022-01-17T13:19:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising