ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Sankranti effect: హాట్‌ కేకుల్లా రైల్వే టిక్కెట్లు

ABN, First Publish Date - 2022-09-13T16:37:07+05:30

సంక్రాంతి పండుగ కోసం దక్షిణ రైల్వే సాధారణ రైళ్ళతో పాటు ప్రత్యేక రైళ్ళను నడుపనుంది. ఈ రైళ్ళకు ముందస్తు రిజర్వేషన్‌ చేసుకునే సదుపాయం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                                      - క్షణాల్లో సంక్రాంతి రిజర్వేషన్‌ ఫుల్‌!

 

అడయార్‌(చెన్నై), సెప్టెంబరు 12: సంక్రాంతి పండుగ కోసం దక్షిణ రైల్వే సాధారణ రైళ్ళతో పాటు ప్రత్యేక రైళ్ళను నడుపనుంది. ఈ రైళ్ళకు ముందస్తు రిజర్వేషన్‌ చేసుకునే సదుపాయం కల్పించింది. ఇందులోభాగంగా సోమవారం  బుకింగ్స్‌ ప్రారంభించి, ఆన్‌లైన్‌తో పాటు రిజర్వేషన్‌ కౌంటర్లలో బుకింగ్‌ చేసుకునే అవకాశం కల్పించింది. అయితే రిజర్వేషన్‌ ప్రారంభమైన కొన్ని క్షణాల్లోనే టిక్కెట్లు హాట్‌ కేకుల్లా అమ్ముడు పోయాయి. పాండ్యన్‌, వైగై, మత్తునగర్‌, పొదిగై, నెల్లై, కన్నియాకుమారితో పాటు పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళలోని అన్ని టిక్కెట్లు ఖాళీ అయిపోయాయి. రాష్ట్రంలోని దక్షిణాది జిల్లాలకు వెళ్ళే వారిలో 85 శాతం మంది ఆన్‌లైన్‌(Online) రిజర్వేషన్‌ సదుపాయాన్ని ఎంచుకుంటారు. దీంతో నగరంలోని రిజర్వేషన్‌ కౌంటర్ల(Reservation counters) వద్ద  ఉదయం 5 గంటల నుంచి వేచివున్న ప్రయాణికులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. కానీ, జనవరి 11వ తేదీ టిక్కెట్లను సోమవారం (13వ తేదీ), జనవరి 12వ తేదీ టిక్కెట్లను బుధవారం (14వ తేదీ), జనవరి 13వ తేదీ టిక్కెట్లు 15న, జనవరి 14వ తేదీ టిక్కెట్లు 16న ప్రారంభంకానుంది. సంక్రాంతి పండుగకు సొంతూర్లకు వెళ్ళిన వారు తిరిగి నగరానికి చేరుకునేందుకు వీలుగా రైళ్ళలో రిజర్వేషన్‌ సౌకర్యం ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. జనవరి 20వ తేదీకి సంబంధించిన టిక్కెట్లను ఈ నెల 22వ తేదీన రిజర్వేషన్‌ చేసుకోవచ్చు. 

Updated Date - 2022-09-13T16:37:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising