ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సొంతూళ్లకు 7 లక్షల మంది !

ABN, First Publish Date - 2022-01-14T13:29:16+05:30

పొంగల్‌ సందర్భంగా నగరం నుంచి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య గురువారం విపరీతంగా పెరిగింది. రవాణా సంస్థ బస్సులు, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు, విద్యుత్‌ లోకల్‌ రైళ్ళలో ప్రయాణీకుల రద్దీ అధికమైంది. గురువారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                     - కిటకిటలాడుతున్న బస్సులు, రైళ్లు


చెన్నై: పొంగల్‌ సందర్భంగా నగరం నుంచి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య గురువారం విపరీతంగా పెరిగింది. రవాణా సంస్థ బస్సులు, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు, విద్యుత్‌ లోకల్‌ రైళ్ళలో ప్రయాణీకుల రద్దీ అధికమైంది. గురువారం ఉదయానికి నగరం నుంచి రైళ్లు, బస్సులలో సుమారు ఏడు లక్షలమంది స్వస్థలాలకు వెళ్ళినట్లు రవాణా, రైల్వేశాఖ అధికారులు తెలిపారు. రెండు రోజులుగా కోయంబేడు బస్‌స్టేషన్‌, ప్రత్యేక బస్సులు నడిచే ఐదు బస్టాపుల వద్ద ప్రయాణికుల రద్దీ అధికమైంది. చెన్నై సబర్బన్‌ ప్రాంతాల్లో ఉంటున్న ప్రభుత్వ, ప్రైవేటు, ఐటీ ఉద్యో గులు, వివిధ కర్మాగారాల్లో పనిచేస్తున్న కార్మికులు సంక్రాంతిని సొంతూళ్లలో జరుపుకోవాలని పొంగల్‌ సరకులు, కొత్త దుస్తులు కొనుక్కుని బయలుదేరి వెళ్ళారు. నగరంలో ఎగ్మూరు, సెంట్రల్‌ రైల్వే స్టేషన్లలో ఉదయం నుంచే ప్రయాణికుల రద్దీ పెరిగింది. ఉత్తరాదికి వెళ్లే రైళ్ళన్నీ నిండిపోయాయి. కోయంబత్తూరు, మదురై, తూత్తుకుడి, కన్నియాకుమారి వైపు వెళ్లే రైళ్లు కూడా కిటకిటలాడాయి. 

Updated Date - 2022-01-14T13:29:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising