ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tomatoes: పారిశుధ్య వాహనాల్లో టమోటాలు

ABN, First Publish Date - 2022-08-02T16:49:32+05:30

టమోటా(Tomatoes) ధరలు భారీగా పతనం అవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రవాణా ఖర్చులు కూడా రాకపోవడంతో టమోటా రైతులు ఆ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెరంబూర్‌(చెన్నై), ఆగస్టు1: టమోటా(Tomatoes) ధరలు భారీగా పతనం అవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రవాణా ఖర్చులు కూడా రాకపోవడంతో టమోటా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొద్దికాలం క్రితం టమోటా ధరలు పెరిగి ప్రజలకు కంటతడి తెప్పించగా, ప్రస్తుతం ధరలు తగ్గడం రైతులను కంటతడి పెట్టిస్తోంది. తిరుప్పూర్‌ జల్లాలో ఎడువాయ్‌, మాణిక్యాపురం(Manikyapuram), పల్లడం, కేత్తనూర్‌, కుల్లం పాళయం, పొల్లికాళియమ్మన్‌పాళయం, పొంగలూరు, ఉడుమలై, తారాపురం తదితర గ్రామాల్లో రైతులు టమోటా సాగు చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో రూ.10 ఉండగా, వ్యాపారులు రైతుల నుంచి రూ.5 కంటే తక్కువగా కొనుగోలు చేస్తున్నారు. దీనిపై ఓ రైతు మాట్లాడుతూ, ప్రస్తుతం 15 కిలోల టమోటాల పెట్టెను రూ.24లకు మాత్రమే వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారని, ఆ ధరకు విక్రయిస్తే రవాణా ఖర్చులు కూడా రావని, మార్కెట్‌కు తెచ్చిన టమోటాలను తిరిగి తీసుకెళ్లడానికి వ్యయమవుతోందని, దీంతో రోడ్డు పక్కనే పడేసి వెళ్తున్నామన్నారు. కాగా, రోడ్డు పక్కన పడిన టమోటా(Tomatoes)లను కార్పొరేషన్‌ సిబ్బంది చెత్తకుప్పల వాహనాల ద్వారా డంపింగ్‌ యార్డ్‌లకు తరలిస్తున్నారు.

Updated Date - 2022-08-02T16:49:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising