ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ద్వేషపూరిత వాతావరణాన్ని సృష్టిస్తున్న సంఘ్‌పరివార్‌

ABN, First Publish Date - 2022-05-21T08:05:07+05:30

జ్ఞాన్‌వాపి, మధుర వంటి విషయాల్లో సంఘ్‌ పరివార్‌ ద్వేషపూరిత వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తోందని మజ్లిస్‌ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మజ్లిస్‌ చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ 

 హైదరాబాద్‌, మే 20 (ఆంధ్రజ్యోతి): జ్ఞాన్‌వాపి,  మధుర వంటి విషయాల్లో  సంఘ్‌ పరివార్‌ ద్వేషపూరిత వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తోందని మజ్లిస్‌ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ ఆరోపించారు. శుక్రవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. సంఘ్‌ పరివార్‌  దేశాన్ని చీకటి దశలోకి నెట్టాలనుకుంటోందని ఘాటుగా విమర్శించారు. జ్ఞాన్‌వాపీ మసీదు వ్యవహారాన్ని  వివాదంలోకి లాగడంతో  బాబ్రీ మసీదు వంటి ఘటన పునరావృతమవుతుందని ముస్లింలు ఆందోళన చెందుతున్నట్లు పేర్కొన్నారు. ముస్లిం మనోభావాలను దెబ్బతీస్తోందన్నారు. జిల్లా కోర్టు జ్ఞాన్‌వాపి మసీదుకు న్యాయం చేస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్‌కౌంటర్‌లకు తాను వ్యతిరేకినన్నారు. దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై విచారణ కమిషన్‌ సమర్పించిన నివేదికపై ఆయన స్పందించారు. ఇలాంటి తప్పుడు ఎన్‌కౌంటర్‌లు చట్టబద్ధమైనపాలనను బలహీనపరుస్తాయని పేర్కొన్నారు. 

Updated Date - 2022-05-21T08:05:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising