ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hanuman Chalisa : చెక్క బల్లపై హనుమాన్ చాలీసా... యోగి ఆదిత్యనాథ్‌కు బహుమతి...

ABN, First Publish Date - 2022-09-07T18:52:08+05:30

ఉత్తర ప్రదేశ్‌ (Uttar Pradesh)లోని కాన్పూరు (Kanpur) నివాసి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో : ఉత్తర ప్రదేశ్‌ (Uttar Pradesh)లోని కాన్పూరు (Kanpur) నివాసి సందీప్ సోనీ అత్యంత భక్తిశ్రద్ధలతో ఓ చెక్క బల్లపై హనుమాన్ చాలీసా (Hanuman Chalisa)ను చెక్కారు. దాదాపు ఎనిమిది నెలలపాటు శ్రమించి ఆయన ఈ లక్ష్యాన్ని పూర్తి చేశారు. దీనిని తన స్వహస్తాలతో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ (Yogi Adityanath)కు బహూకరించాలని ఆకాంక్షిస్తున్నారు. 


సందీప్ సోనీ (Sandeep Soni) వృత్తి రీత్యా వడ్రంగి పనులు  చేస్తారు. ఆయన హనుమాన్ చాలీసాలోని 3 పద్యాలు, 40 శ్లోకాలను  స్క్రాప్‌ను ఉపయోగించి, ఓ చెక్క బల్లపై చెక్కారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు దీనిని బహుమతిగా ఇవ్వాలని తాను కోరుకుంటున్నానని తెలిపారు. 




మోదీకి భగవద్గీత 

సందీప్ ఓ చెక్క బల్లపై భగవద్గీత (Bhagavad gita)లోని 706 శ్లోకాలను  చెక్కారు. దానిని 2016 మార్చిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)కి బహూకరించారు. 2016 మార్చి 8న మోదీ ఇచ్చిన ట్వీట్‌లో, చెక్కబల్లపై చెక్కిన భగవద్గీత నకలును సందీప్ సోనీ తనకు బహూకరించారని పేర్కొన్నారు. ఆయన తనపట్ల చూపిన అభిమానానికి ధన్యవాదాలు చెప్తున్నానని తెలిపారు. 


మోదీకి భగవద్గీతను బహూకరించాలని కోరుకుంటున్నానని సందీప్ ప్రకటించిన తర్వాత ఆయన పనితనం గురించి ప్రపంచానికి తెలిసింది. దీంతో ప్రధాన మంత్రి కార్యాలయం సందీప్‌ను ఆహ్వానించింది. 




Updated Date - 2022-09-07T18:52:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising