ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం యోగిపై ఎన్నికల బరిలో బ్రాహ్మణ అభ్యర్థి

ABN, First Publish Date - 2022-01-21T13:34:24+05:30

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై సమాజ్‌వాదీ పార్టీ బ్రాహ్మణ అభ్యర్థిని నిలబెడుతుందా?...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సమాజ్‌వాదీ పార్టీ వ్యూహం

గోరఖ్‌పూర్: ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై సమాజ్‌వాదీ పార్టీ బ్రాహ్మణ అభ్యర్థిని నిలబెడుతుందా? అంటే అవునంటున్నాయి ఆ పార్టీ వర్గాలు.రాబోయే ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో తన సొంత గడ్డ అయిన గోరఖ్‌పూర్ అర్బన్ స్థానం నుంచి సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. యోగిపై గట్టి పోటీ ఇచ్చేందుకు వీలుగా సమాజ్‌వాదీ పార్టీ బ్రాహ్మణ అభ్యర్థిని నిలబెట్టే అవకాశం ఉంది.అధికారంలో ఉన్న యోగి హయాంలో బ్రాహ్మణులు కలత చెందారు. దీంతో యోగిపై బ్రాహ్మణ అభ్యర్థిని ఎన్నికల బరిలోకి దించడం ద్వారా ఓట్లు పొందాలని అఖిలేష్ యాదవ్ రాజకీయ ఎత్తుగడ వేశారు. ఇప్పటికే యోగిపై భీంఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ పోటీ చేస్తానని ప్రకటించారు.


సమాజ్‌వాదీ పార్టీ వర్గాల సమాచారం ప్రకారం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్న దివంగత ఉపేంద్ర దత్ శుక్లా భార్య సుభావతి శుక్లా సీఎం యోగిపై పోటీ చేసే అవకాశం ఉంది. ఆమె బ్రాహ్మణ అభ్యర్థిని. గురువారం సాయంత్రం సుభావతి తన ఇద్దరు కుమారులతో కలిసి ఎస్పీ పార్టీ వద్దకు చేరడం గమనార్హం. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత్ర మీడియా సమావేశంలో యోగికి వ్యతిరేకంగా సుభావతి అభ్యర్థిత్వం గురించి కూడా సూచించారు.గోరఖ్ పూర్ సీటులో పోటీ చేసేందుకు చాలా మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని,అయితే ఒక బ్రాహ్మణ కుటుంబం కూడా నన్ను కలవడానికి వచ్చిందని అఖిలేష్ యాదవ్ చెప్పారు.


ఠాకూర్ ఫైర్‌బ్రాండ్ బీజేపీ నేతపై బ్రాహ్మణ ముఖాన్ని ఎస్‌పి రంగంలోకి దింపడం వల్ల అఖిలేష్ యాదవ్‌కు బ్రాహ్మణ ఓట్లు వచ్చే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు పేర్కొన్నారు.భారతీయ జనతా పార్టీకి చెందిన రాధా మోహన్ దాస్ అగర్వాల్ ప్రస్తుతం ఈ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.గోరఖ్ పూర్ అసెంబ్లీ స్థానం నుంచి రాధా మోహన్ దాస్ నాలుగుసార్లు గెలిచారు.


Updated Date - 2022-01-21T13:34:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising