ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీ-23పై చింత ఎందుకు జీ-500 ఉండగా: కాంగ్రెస్ నేత ఖుర్షీద్

ABN, First Publish Date - 2022-04-10T01:08:49+05:30

ప్రస్తుతం అస్సాం పర్యటనలో ఉన్నా ఆయన.. కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో జీ-23 సంక్షోభం అంటూ మీడియా ప్రశ్నించింది. దీనికి ఆయన సమాధానం ఇస్తూ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గువహాటి: కాంగ్రెస్ పార్టీలోని 23 మంది సీనియర్ నేతలు పార్టీ అధిష్టానికి వ్యతిరేకంగా అప్పట్లో ఒక లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే వీరంతా గాంధీ కుటుంబ నాయకత్వానికి వ్యతిరేకమని, పార్టీలో అనేక మార్పులు జరగాలని వారు డిమాండ్ చేస్తున్నారని చాలా రోజుల నుంచి వస్తున్నాయి. విపక్ష పార్టీలకంటే ఈ జీ-23 నేతలే కాంగ్రెస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారారనే వ్యాఖ్యలు సైతం వినిపిస్తున్నాయి. అవేవీ నిజం కావని, పార్టీ నాయకత్వాన్ని వారేమీ వ్యతిరేకించడం లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సల్మీన్ ఖుర్షీద్ శనివారం అన్నారు.


ప్రస్తుతం అస్సాం పర్యటనలో ఉన్నా ఆయన.. కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో జీ-23 సంక్షోభం అంటూ మీడియా ప్రశ్నించింది. దీనికి ఆయన సమాధానం ఇస్తూ ‘‘ఈ దేశ రాజకీయాల్లో చాలా పెద్ద సంక్షోభం ఉంది. కానీ కాంగ్రెస్ నాయకత్వంలో ఎలాంటి సంక్షోభం లేదు. మా పార్టీ కొన్ని ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన మేం బలహీనపడ్డట్టు కాదు. ఎందుకు జీ-23 గురించి అంతగా ఆందోళన చెందుతారు. మా దగ్గర జీ-500, జీ-1000, జీ-2000 ఇలా చెప్పుకుంటూ పోతే వేలాది మంది నేతలు ఉన్నారు’’ అని అన్నారు.

Updated Date - 2022-04-10T01:08:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising