ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సచిన్‌ పైలట్‌ ద్రోహి

ABN, First Publish Date - 2022-11-25T03:37:30+05:30

‘‘ఒక ద్రోహి ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేడు. కనీసం 10మంది ఎమ్మెల్యేలు కూడా లేని వ్యక్తిని, ద్రోహిగా ముద్ర పడిన సచిన్‌ పైలట్‌ను కాంగ్రెస్‌ అధిష్ఠానం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాంగ్రెస్‌ ఆయన్ను సీఎం చేయబోదు

బీజేపీతో చేతులు కలిపారు : గహ్లోత్‌

పాలి(రాజస్థాన్‌), నవంబరు 24: ‘‘ఒక ద్రోహి ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేడు. కనీసం 10మంది ఎమ్మెల్యేలు కూడా లేని వ్యక్తిని, ద్రోహిగా ముద్ర పడిన సచిన్‌ పైలట్‌ను కాంగ్రెస్‌ అధిష్ఠానం ఎట్టి పరిసితుల్లోనూ ముఖ్యమంత్రిని చేయబోదు. అతను పార్టీని మోసగించిన ద్రోహి’’ అని రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌ మండిపడ్డారు. ఓ జాతీయ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ పైలట్‌ ద్రోహి అని పదేపదే ఆరోపించారు. ‘‘102మంది నమ్మకస్తులైన ఎమ్మెల్యేలలో ఎవరినైనా సీఎం చేయండి. ద్రోహం చేసిన వ్యక్తిని ఎలా అంగీకరిస్తాం?’’ అని ప్రశ్నించారు. ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తమ సొంత ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నించడం, ప్రతిపక్షంతో చేతులు కలపడం దేశంలోనే మొదటిసారన్నారు. 2020లో పైలట్‌ చేసిన తిరుగుబాటుకు బీజేపీ నిధులు సమకూర్చిందన్నారు. కాగా, గహ్లోత్‌ చేసినవన్నీ నిరాధారమైన ఆరోపణలని రాజస్థాన్‌ బీజేపీ చీఫ్‌ సతీశ్‌ పూనియా స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి పైలట్‌తో బీజేపీ చేతులు కలిపిందన్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు.

Updated Date - 2022-11-25T03:37:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising