ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉక్రెయిన్‌లో మెలిటోపోల్ నగరం రష్యా సేనల వశం

ABN, First Publish Date - 2022-02-26T19:35:03+05:30

ఉక్రెయిన్‌ ఆగ్నేయ దిశలోని జపొరిజ్జ్య ప్రాంతంలో ఉన్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కీవ్ : ఉక్రెయిన్‌ ఆగ్నేయ దిశలోని జపొరిజ్జ్య ప్రాంతంలో ఉన్న మెలిటోపోల్ నగరం తమ వశమైందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఐగోర్ కొనషెంకోవ్ శనివారం చెప్పారు. రష్యన్ సాయుధ దళాలు ఈ నగరంపై సంపూర్ణ ఆధిపత్యం సాధించినట్లు తెలిపారు. ప్రజల రక్షణ, భద్రత కోసం తమ సైన్యం అన్ని చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఉక్రెయిన్ జాతీయవాదులు, స్పెషల్ సర్వీసెస్ ప్రతిఘటనను తిప్పికొట్టేందుకు కూడా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. 


రష్యా గురువారం నుంచి ఉక్రెయిన్‌పై దాడులు చేస్తోంది. ఉక్రెయిన్ దళాలను తిప్పికొట్టేందుకు డోనెట్‌స్క్, లుహాన్‌స్క్ పీపుల్స్ రిపబ్లిక్స్ సహాయం కోరాయని, దీనికి ప్రతిస్పందిస్తూ యుద్ధం చేస్తున్నామని రష్యా చెప్తోంది. ఉక్రెయిన్ సైనిక మౌలిక సదుపాయాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నామని, సాధారణ ప్రజానీకానికి ఎటువంటి ప్రమాదం లేదని చెప్తోంది. ఉక్రెయిన్‌ను ఆక్రమించాలనే ఆలోచన తమకు లేదంటోంది. డీమిలిటరైజ్, డీ-నాజిఫై ఉక్రెయిన్ లక్ష్యంగా ఈ ప్రత్యేక ఆపరేషన్‌ను రష్యా ప్రారంభించిందని విశ్లేషకులు చెప్తున్నారు. 


Updated Date - 2022-02-26T19:35:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising