ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొదటిరోజు దాడిలో రష్యా ఫెయిల్: బ్రిటన్

ABN, First Publish Date - 2022-02-25T22:17:05+05:30

బ్రిటన్ గూఢచారి వ్యవస్థ నుంచి వచ్చిన సమాచారం ప్రకారమే తాను ఈ విషయాన్ని చెబుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. బయటికి భీకర స్థాయిలో యుద్ధం చేస్తున్నట్లు కనిపించినా రష్యా అనుకున్న స్థాయిలో దండయాత్ర కొనసాగడం లేదని బెన్ అన్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్: ఉక్రెయిన్‌పై దాడికి దిగిన రష్యా.. మొదటిరోజు ప్రయత్నం విఫలమైందని బ్రిటన్ రక్షణ శాఖ కార్యదర్శి బెన్ వాల్లెస్ అన్నారు. ఉక్రెయిన్‌పై పథకం ప్రకారం దాడి చేయలేదని, రష్యా నిర్దేశించుకున్న లక్ష్యాలను చేధించడంలో రష్యన్ దళాలు విఫలమయ్యాయని ఆయన అన్నారు. బ్రిటన్ గూఢచారి వ్యవస్థ నుంచి వచ్చిన సమాచారం ప్రకారమే తాను ఈ విషయాన్ని చెబుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. బయటికి భీకర స్థాయిలో యుద్ధం చేస్తున్నట్లు కనిపించినా రష్యా అనుకున్న స్థాయిలో దండయాత్ర కొనసాగడం లేదని బెన్ అన్నారు.


ఉక్రెయిన్‌పై రెండో రోజూ రష్యా భీకర యుద్ధం చేస్తోంది. ఉక్రెయిన్‌ రాజధాని నగరం కీవ్ సహా ప్రధాన నగరాలపై  గురువారం ఉదయం ప్రారంభమైన భీకర దాడుల్లో ఇప్పటి వరకు దాదాపు 137 మంది ఉక్రెయినియన్లు ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా. భూ, ఆకాశ, సముద్ర మార్గాల్లో ఈ దాడులు జరుగుతున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరోపులో ఏర్పడిన భారీ సంక్షోభాల్లో ఇదొకటి. నిన్నటి నుంచీ రష్యా భీకర యుద్ధంతో ఉక్రెయిన్ చిగురుటాకులా వణికిపోతోంది. యుద్ధం విషయంలో వెనక్కి తగ్గేదే లేదని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఛాలెంజ్ చేసి మరీ చెబుతుండగా.. ఉక్రెయిన్‌ను ఒంటరిగా వదిలేశారని.. ప్రపంచం పట్టించుకోవట్లేదని అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2022-02-25T22:17:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising