ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రమాదంలో ఉక్రెయిన్ భవిష్యత్తు : పుతిన్

ABN, First Publish Date - 2022-03-06T18:03:52+05:30

ఉక్రెయిన్ స్వతంత్ర దేశ హోదా ప్రమాదంలో పడుతుందని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాస్కో : ఉక్రెయిన్ స్వతంత్ర దేశ హోదా ప్రమాదంలో పడుతుందని రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ శనివారం హెచ్చరించారు. రష్యాపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలను విధించడమంటే యుద్ధాన్ని ప్రకటించడమేనని వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ నేతలు ప్రస్తుత చర్యలను కొనసాగిస్తే దాని స్వతంత్ర దేశ హోదా భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందని అర్థం చేసుకోవాలని తెలిపారు. అదే జరిగితే అందుకు పూర్తి బాధ్యత వారిదేనని చెప్పారు. 


ఉక్రెయిన్‌పై నో-ఫ్లై జోన్‌ను ప్రకటిస్తే విస్తృత స్థాయి యుద్ధానికి దిగుతామని పుతిన్ NATO (నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్)ను హెచ్చరించారు. ప్రస్తుత పరిస్థితులకు పూర్తి బాధ్యత ఉక్రెయిన్ ప్రభుత్వ నేతలదేనని చెప్పారు. ఉక్రెయిన్‌పై నో-ఫ్లై జోన్‌ను ప్రకటించే ఏ దేశమైనా యుద్ధంలోకి దిగినట్లు భావిస్తామన్నారు. నో-ఫ్లై జోన్‌ను ప్రకటిస్తే యూరోప్‌నకు మాత్రమే కాకుండా యావత్తు ప్రపంచానికి అత్యంత ఘోరమైన పర్యవసానాలు ఎదురవుతాయని హెచ్చరించారు. 


మరోవైపు, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ NATOపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ దేశంపై నో-ఫ్లై జోన్‌ను ప్రకటించాలన్న తన డిమాండ్‌ను తిరస్కరించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ఉక్రెయిన్ మిత్ర దేశాలు ఈ విజ్ఞప్తిని తోసిపుచ్చాయి. ఈ విజ్ఞప్తిని అంగీకరిస్తే రష్యాతో యుద్ధం మరింత విస్తృతం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశాయి. 


ఇదిలావుండగా, ఫిబ్రవరి 24న ప్రారంభమైన యుద్ధంలో ఉక్రెయిన్ నుంచి రష్యా దళాలకు తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. ఈ ప్రతిఘటన నేపథ్యంలోనే పుతిన్ శనివారం హెచ్చరించారు. ఉక్రెయిన్‌లోని మరియుపోల్ నగరంలో కాసేపు కాల్పుల విరమణను ప్రకటించినప్పటికీ శనివారం పెద్ద ఎత్తున బాంబులతో రష్యా విరుచుకుపడింది.


పాశ్చాత్య దేశాల ఆంక్షల కారణంగా రష్యా ఆర్థిక వ్యవస్థ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఉక్రెయిన్‌పై యుద్ధం వల్ల, రష్యాపై ఆంక్షల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) ఆదివారం హెచ్చరించింది. 


Updated Date - 2022-03-06T18:03:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising